News April 13, 2025
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ముగిసిన కొట్టాయి ఉత్సవం

శ్రీకాళహస్తీశ్వరాలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం శనివారంతో ముగిసింది. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు స్వామి, అమ్మవార్లకు ఈ నెల 6 వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పెద్ద కొట్టాయి ఉత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. ప్రతిరోజు స్వామి, అమ్మవార్లను కోట మండపం వద్దకు తీసుకువచ్చి విశేష పూజలు జరిపారు. చివరి రోజైన శనివారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపి, పురవీధులలో స్వామి అమ్మవార్లను ఊరేగించారు.
Similar News
News April 14, 2025
జూబ్లీహిల్స్ పెద్దమ్మను దర్శించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి

సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సోమవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించిన సందర్భంగా ఆయన అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
News April 14, 2025
ఉద్యోగులకు డా.రెడ్డీస్ షాక్?

ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ ఉద్యోగులకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖర్చులను తగ్గించుకునేందుకు 25% ఎంప్లాయీస్‌ను తొలగిస్తోందని ‘బిజినెస్ స్టాండర్డ్స్’ తెలిపింది. వార్షిక వేతనం రూ.కోటికిపైన ఉన్నవారిని రాజీనామా చేయాలని, 50-55 ఏళ్ల పైన ఉన్న సీనియర్ ఎంప్లాయీస్‌ని VRS తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొంది. మేజర్‌గా R&D ఉద్యోగులపైనే ఫోకస్ చేసినట్లు సమాచారం. దీనిపై సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
News April 14, 2025
గద్వాల: ‘జార్జిరెడ్డి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి’

PDSU వ్యవస్థాపకుడు జార్జిరెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అకేపోగు రాజు ఆధ్వర్యంలో జార్జ్ రెడ్డి 53వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నాయకుడు గంజిపేట రాజు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజు మాట్లాడుతూ.. జార్జిరెడ్డి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.