News April 13, 2025
ఏప్రిల్ 13: చరిత్రలో ఈరోజు

1919: పంజాబ్ జలియన్ వాలాబాగ్లో జనరల్ డయ్యర్ జరిపిన కాల్పుల్లో 379 మంది ఉద్యమకారులు మృతి
1999: నాదస్వర విద్వాంసులు షేక్ చిన మౌలానా మరణం
1999: ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు మరణం
2007: నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి మరణం
2007: రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి మరణం
* జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినోత్సవం
Similar News
News April 15, 2025
ALERT: నేటి నుంచి 3 రోజులు వర్షాలు

AP: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉరుములతో వర్షం కురిసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలంది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News April 15, 2025
కంచ గచ్చిబౌలిపై మోదీ కామెంట్స్.. మంత్రుల కౌంటర్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో అడవులను ధ్వంసం చేస్తోందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రులు కౌంటరిచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల్లో తాము చెట్లు నరకలేదని, జంతువులను చంపట్లేదని స్పష్టం చేశారు. అడవులను పెంచి ప్రకృతిని కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కంచ గచ్చిబౌలిలో అసలు అటవీ భూమి లేదని, బీజేపీ నేతలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని మరో మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు.
News April 15, 2025
IPL: నేడు పంజాబ్, కోల్కతా మధ్య పోరు

IPLలో ఇవాళ PBKS, KKR తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకూ 33 మ్యాచులు జరగ్గా KKR 21, PBKS 12 మ్యాచుల్లో నెగ్గాయి. గత 4 సీజన్లలో అయితే చెరో 4 విజయాలు దక్కించుకున్నాయి. గాయంతో ఫెర్గూసన్ దూరమవడం PBKSకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఆ జట్టు మాక్స్వెల్ నుంచి మంచి నాక్ ఆశిస్తోంది. అటు బెస్ట్ AVG, ఎకానమీతో బౌలింగ్ చేస్తున్న KKR స్పిన్నర్లు పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేసే అవకాశం ఉంది.