News April 13, 2025

ఆదిలాబాద్‌: రేపు ITI కళాశాలలో అప్రెంటిషిప్ మేళా

image

ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 14న జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని ఐటీఐ ఉత్తీర్ణులైనా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారంగా స్టైపెండ్‌ను శిక్షణ కాలంలో నేరుగా అభ్యర్థుల ఖాతాలకు జమ చేస్తాయన్నారు.

Similar News

News April 15, 2025

మంచిర్యాల: బాలుడి కడుపులో బ్యాటరీ

image

3 ఏళ్ల చిన్నారి కడుపులోని బ్యాటరీని బయటకు తీసి కాపాడారు వైద్యులు. ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని తీసి అందరి మన్ననలు పొందారు. శ్రీరాంపూర్‌కు చెందిన రాజ్ కుమార్-మౌనిక దంపతుల కుమారుడు ఆదిత్య. 2 నెలల కిందట బటన్ బ్యాటరీ మింగాడు. కడుపులో మంట, నొప్పితో పలు ఆసుపత్రిలో చూపించినా నయం కాలేదు. డా.సతీశ్‌చందర్ ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని గుర్తించి బయటికి తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు.

News April 15, 2025

ADB: నేటి నుంచి యూడైస్ ప్లస్ సర్వే

image

జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్ ప్లస్ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. డైట్, బీఎడ్ ఛాత్రోపాధ్యాయుల ద్వారా క్షేత్రస్థాయి విద్యార్థుల నమోదు, హాజరు సంఖ్య, మౌలిక వసతుల వంటి అంశాలపై 585 పాఠశాలల్లో సర్వే చేయనున్నారు. జిల్లాకు సర్వే చేయడానికి 59 మందిని ఎంపిక చేసి ఇదివరకే శిక్షణను ఇచ్చారు. సర్వే ద్వారా అవసరమైన వసతులు కల్పించనున్నారు.

News April 15, 2025

ADB: కత్తులతో పోస్టులు పెడుతున్నారా.. జాగ్తత్త

image

సోషల్ మీడియాలో ఫాలోవర్ల కోసమో.. హైప్ కోసం కత్తులు పట్టుకొని వీడియోలు పెడుతున్నారా.. జాగ్రత్త. ఇలాంటి వాటిపై ADB పోలీసులు దృష్టి సారించారు. ఎంతటి వారైనా తమ నుంచి తప్పించుకోలేరని హెచ్చరిస్తున్నారు. బైక్‌పై నోట్లో కత్తి పెట్టుకొని వీడియోలు పోస్ట్ చేసిన బంగారిగూడకు చెందిన సలీంపై ఇప్పటికే కేసుపెట్టారు. ఇలాగే వ్యవహరించిన పలువురిపై చర్యలు తీసుకున్నారు. ప్రజలను ఇబ్బందిపెడితే ఉపేక్షించేది లేదంటున్నారు.

error: Content is protected !!