News March 27, 2024

HYD: ఆక్రమణలు గుర్తించేందుకు మూసీలో డ్రోన్లతో సర్వే

image

మూసీలో ఆక్రమణలు గుర్తించే పనిపై మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (MRDCL) దృష్టి సారించింది. నదికి రెండువైపులా 2 కి.మీ. పరిధిలో డ్రోన్లను ఉపయోగించి ఎక్కడెక్కడ భవనాలు, ఇతర నిర్మాణాలున్నాయో గుర్తిస్తారు. FTLతో పాటు బఫర్ జోన్‌లో ఎన్ని ఆక్రమణలున్నాయో సర్వే చేస్తారు. అవసరమైతే జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (GSI)తో అనుసంధానం చేసి ఆక్రమణలపై దృష్టి సారించనున్నారు.

Similar News

News November 17, 2024

హైటెక్స్‌లో వివాహానికి హాజరైన కేటీఆర్

image

హైదరబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కుమారుడు శశిధర్ రెడ్డి, అక్షిత రెడ్డి వివాహ మహోత్సవానికి మాజీ మంత్రి, BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు లక్ష్మా రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.

News November 17, 2024

ALERT: హైదరాబాద్ ఫుడ్ డేంజర్!

image

HYDలోని రెస్టారెంట్లలో క్వాలిటీ తగ్గుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే ఇందుకు నిదర్శనం. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో HYD కల్తీలో నం.1 అని సర్వే పేర్కొంది. ఏకంగా 62% హోటళ్లు గడువు ముగిసిన ఆహార పదార్థాలు కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు పేర్కొంది. గడిచిన 2 నెలల వ్యవధిలోనే 84% ఫుడ్ పాయిజన్ కేసులు నగరంలో నమోదు కావడం గమనార్హం. దీంతో GHMC అప్రమత్తమైంది. అన్ని హోటల్స్‌లో తనిఖీలు చేపట్టింది.

News November 17, 2024

GROUP-3 EXAM: HYDలో‌ సెంటర్ల వివరాలు

image

గ్రూప్-3 పరీక్షకు అంతా సిద్ధమైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా మన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 115 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 65,361మంది అభ్యర్థులు పరీక్ష హాజరుకావాల్సి ఉంది. రంగారెడ్డిలో 103 పరీక్ష కేంద్రాల్లో 56,394 మంది, హైదరాబాద్‌లో 102 కేంద్రాల్లో 45,918 మంది పరీక్ష రాయనున్నారు. మూడు జిల్లాల్లోనే ఏకంగా 1,67,673 మంది పోటీలో ఉండటం విశేషం. 10 AMకు పరీక్ష. గంట ముందే చేరుకోండి.
ALL THE BEST