News April 13, 2025
అన్యాయంపై ప్రశ్నిస్తే నోటీసులిస్తారా?: హరీశ్ రావు

TG: గ్రూప్-1 అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన <<16075233>>రాకేశ్ రెడ్డి<<>>కి పరువు నష్టం దావా నోటీసులిస్తారా? అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అన్యాయాలను, అక్రమాలను నిలదీస్తే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూనే నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు చేస్తే వాస్తవాలు బయటపెట్టాల్సింది పోయి నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.
Similar News
News April 15, 2025
ఈనెల 22న టెన్త్ ఫలితాలు విడుదల?

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 3 నుంచి 9 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ప్రస్తుతం మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 22న రిజల్ట్స్ ప్రకటించే అవకాశముంది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన పరీక్షలకు దాదాపు 6.50L మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఇటీవల ఇంటర్ ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే.
News April 15, 2025
దేశంలో తగ్గుతున్న డీజిల్ డిమాండ్

దేశంలో డీజిల్ డిమాండ్ తగ్గుతూ వస్తోంది. 2022-2023లో దాని వినియోగంలో 12.1శాతం వృద్ధి కనిపించగా, 2024-25లో అది 2శాతానికి పడిపోయింది. వ్యవసాయ యంత్రాలు, డీజిల్ ట్రక్కుల వాడకం తగ్గడం.. ఈవీల వాడకం పెరగడమే దీనికి కారణంగా బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, పెట్రోల్ వినియోగం 7.5 శాతం పెరిగి 4 కోట్ల టన్నులకు, ఎల్పీజీ డిమాండ్ 5.6 శాతం పెరిగి 3.13 కోట్ల టన్నులకు చేరింది.
News April 15, 2025
నేటి నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ

TG: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీజీ టెట్) దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000గా ఫీజు నిర్ణయించారు. అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు వస్తే హెల్ప్‌డెస్క్(7093958881, 7093468882) ఈ నెల 15 నుంచి జులై 22 వరకు అందుబాటులో ఉంటుంది. టెట్ పరీక్షలు జూన్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.