News April 13, 2025

ప్రపంచంలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ ఇవే

image

ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ గేమ్‌గా ఫుట్‌బాల్ నిలిచింది. 3.5 బిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో సాకర్ మొదటిస్థానంలో కొనసాగుతోంది. 2.5 బిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో క్రికెట్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హాకీ (2 బిలియన్), టెన్నిస్ (1 బిలియన్), వాలీబాల్ (900 మిలియన్) టాప్-5లో నిలిచాయి. టేబుల్ టెన్నిస్, బాస్కెట్ బాల్, బేస్ బాల్, రగ్బీ, గోల్ఫ్ టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.

Similar News

News April 15, 2025

సూడాన్‌లో కాల్పులు.. 300 మంది మృతి

image

సూడాన్‌లో ఇటీవల <<16082587>>పారామిలటరీ RSF జరిపిన కాల్పుల్లో<<>> మృతుల సంఖ్య 300 దాటినట్లు UN హ్యుమానిటీ ఏజెన్సీ వెల్లడించింది. వీరిలో 10 మంది ఐరాస సిబ్బంది కూడా ఉన్నట్లు పేర్కొంది. మృతుల్లో 23 మంది చిన్నారులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. కాల్పుల భయంతో 16వేల మంది జామ్జామ్‌ వలస శిబిరాన్ని వీడినట్లు సమాచారం. దాడులను UN చీఫ్ గుటెర్రస్ ఖండించారు. శత్రుత్వాన్ని వీడి ప్రజలకు రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు.

News April 15, 2025

దర్శక నటుడు స్టాన్లీ కన్నుమూత

image

కోలీవుడ్ దర్శకుడు, నటుడు ఎస్ఎస్ స్టాన్లీ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. ‘పుదుకొట్టయిరుందు శరవణన్’, ‘ఏప్రిల్ మంత్’, ఈస్ట్‌కోస్ట్ రోడ్’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే స్టాన్లీ పలు తమిళ హిట్ సినిమాల్లోనూ నటించారు. విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ మూవీలో ఆయన చివరిసారిగా కనిపించారు.

News April 15, 2025

టీటీడీలో 2 వేల మంది మా వాళ్లే: భూమన

image

AP: టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 2 వేల మంది తమవారేనని YCP నేత, TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. టీటీడీలో జరిగే పరిణామాలపై వారు ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇస్తూనే ఉంటారని చెప్పారు. ‘గోశాలలో ఆవుల మృతిపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా. నేను విడుదల చేసిన ఫొటోలు తప్పని తేలితే నాపై చర్యలు తీసుకోవచ్చు. నిజమైతే టీటీడీ ఈఓ, ఛైర్మన్‌ను తొలగించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

error: Content is protected !!