News April 13, 2025
మటన్‌ను ఎంత తినాలి?

నాన్‌వెజ్ ప్రియులు మటన్‌ను ఇష్టంగా తింటారు. అయితే, అందులో కొవ్వులు ఎక్కువ ఉండటం వల్ల తగిన మోతాదులోనే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి వారానికి గ్రా.300, శారీరక శ్రమ చేసేవారు గ్రా.500 తినొచ్చని చెబుతున్నారు. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు గ్రా.100 మించి తినకూడదు. అలాగే, సరిగా ఉడకని మటన్ తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. కొందరికి అజీర్తి ఏర్పడి విరేచనాలు అవుతాయి.
Similar News
News January 17, 2026
సావిత్రి గౌరీ నోము ఎలా ఆచరించాలి?

మట్టితో చేసిన దేవతా మూర్తుల బొమ్మలను ఓ పీఠంపై ఉంచి, వాటి మధ్యలో పసుపుతో చేసిన గౌరీదేవిని పూజించాలి. నూతన వధువులు ఈ వ్రతాన్ని వరుసగా 9 రోజుల పాటు భక్తితో ఆచరిస్తే శుభం కలుగుతుందని నమ్మకం. రోజూ అమ్మవారికి 9 రకాల పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. ముత్తయిదువులను పేరంటానికి పిలిచి పండ్లు, తాంబూలం వాయనంగా ఇవ్వాలి. తొమ్మిదో రోజు పూజ పూర్తయ్యాక, ఆ మట్టి బొమ్మలను పుణ్యతీర్థాలలో నిమజ్జనం చేయాలి.
News January 17, 2026
నటి శారదకు ప్రతిష్ఠాత్మక అవార్డు

మలయాళ చిత్రసీమలో అత్యున్నత గౌరవంగా భావించే జేసీ డానియల్ అవార్డు-2024ను సీనియర్ నటి శారదకు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మలయాళ సినిమాకు ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం ఇచ్చింది. రూ.5 లక్షల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికతో కూడిన ఈ అవార్డును ఈ నెల 25న CM పినరయి విజయన్ అందజేయనున్నారు. ఈ అవార్డు పొందిన 32వ సినీ ప్రముఖురాలిగా శారద నిలిచారు.
News January 17, 2026
యూరియాకు గుళికలు కలుపుతున్నారా?

వరి సాగులో చాలా మంది రైతులు మొదటి దఫా యూరియా వేసేటప్పుడు బస్తా యూరియాకు 4-5 కిలోల గుళికల మందును కలిపి చల్లుతారు. పైరు బాగా పెరగడానికి యూరియా.. పురుగుల నివారణకు గుళికల మందు ఉపయోగపడుతుందనేది రైతుల భావన. కానీ పురుగుల కట్టడికి ఎకరాకు మందు రకాన్ని బట్టి 8-10 కిలోల గుళికలు అవసరం. తక్కువ వేస్తే పురుగులు వాటిని తట్టుకొని నిలబడతాయి. అందుకే రైతులు గుళికల మందు వాడకంలో వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.


