News April 13, 2025
ASF: తాటి ముంజలకు భలే గిరాకీ

ఎండాకాలం వచ్చిందంటే వేడి తాపానికి ఉపశమనం కలుగజేసే తాటి ముంజలు జిల్లాలో అందుబాటులో లభిస్తాయని ప్రజలు అంటున్నారు. శనివారం వాంకిడి మండలకేంద్రంలో తాటి ముంజల విక్రయాలు జోరందుకున్నాయి. ప్రజలు ముంజలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముంజలు తింటే ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలున్నాయని వైద్యలు సూచించడంతో కొనడానికి మక్కువ చూపుతున్నారు.
Similar News
News April 15, 2025
పోక్సో కేసు.. సంచలన తీర్పు

బాలిక(15)ను ఓ యువకుడు(22) రేప్ చేశాడన్న కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2020లో నవీ ముంబైకి చెందిన బాలిక UPకి చెందిన యువకుడితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. 10 నెలల తర్వాత గర్భంతో ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె తండ్రి యువకుడిపై పోక్సో కేసు పెట్టారు. వాదనలు విన్న కోర్టు ‘బాలిక ఇష్టప్రకారమే వెళ్లింది. ఏం జరుగుతుందో ఆమెకు తెలుసు’ అని పేర్కొంటూ యువకుడికి బెయిల్ మంజూరు చేసింది.
News April 15, 2025
ములుగు: వేసవి సెలవులు.. ఓ కన్నేసి ఉంచండి!

ఈనెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అయితే సెలవుల్లో పిల్లలు చెరువులు, బావుల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. వారిపై ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు. స్నేహితులతో దూర ప్రాంతాలకు పంపవద్దని, బైకులు ఇవ్వొద్దని, ఫోన్ వాడకుండా చూడాలని అంటున్నారు. కాగా, ములుగు జిల్లాలో సెలవుల్లో ప్రమాదాల బారినపడి పిల్లలు మరణించిన సందర్భాలూ ఉన్నాయి.
News April 15, 2025
Big Alert.. సికింద్రాబాద్ రైల్వే ప్లాట్‌ఫామ్స్ క్లోజ్

సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా 6 ప్లాట్‌ఫామ్స్ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్లకు దాదాపు 120 రైళ్లను మళ్లించనున్నారు. రెన్నోవేషన్‌లో భాగంగా ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, లిఫ్టులు నిర్మించనున్నారు. 110 మీ. వెడల్పు, 120 మీ. పొడవుతో నిర్మించే స్కై కాంకోర్స్‌లో రిటైల్ ఔట్‌లెట్స్, కియోస్కులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు.