News April 13, 2025
ఇల్లు కొనాలనే తొందరలో తప్పులొద్దు!

సొంతిల్లు కొనాలనే తొందరలో కొందరు చేసే చిన్న తప్పులే మున్ముందు చాలా ఇబ్బందులు తెస్తాయి. ముందుగా అసలు ఇల్లు ఎందుకు కొనాలని అనుకుంటున్నామో స్పష్టత ఉండాలి. ఏ ప్రాంతంలో కొంటున్నాం? అక్కడ వృద్ధి ఎలా ఉంటుంది? అద్దెకు ఇస్తే ఆదాయం ఎంతొస్తుంది? ముందుగా అనుకున్న దాని కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చిస్తున్నామా? తదితర ప్రశ్నలు వేసుకోకపోతే భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News April 15, 2025
పోక్సో కేసు.. సంచలన తీర్పు

బాలిక(15)ను ఓ యువకుడు(22) రేప్ చేశాడన్న కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2020లో నవీ ముంబైకి చెందిన బాలిక UPకి చెందిన యువకుడితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. 10 నెలల తర్వాత గర్భంతో ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె తండ్రి యువకుడిపై పోక్సో కేసు పెట్టారు. వాదనలు విన్న కోర్టు ‘బాలిక ఇష్టప్రకారమే వెళ్లింది. ఏం జరుగుతుందో ఆమెకు తెలుసు’ అని పేర్కొంటూ యువకుడికి బెయిల్ మంజూరు చేసింది.
News April 15, 2025
Big Alert.. సికింద్రాబాద్ రైల్వే ప్లాట్‌ఫామ్స్ క్లోజ్

సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా 6 ప్లాట్‌ఫామ్స్ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్లకు దాదాపు 120 రైళ్లను మళ్లించనున్నారు. రెన్నోవేషన్‌లో భాగంగా ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, లిఫ్టులు నిర్మించనున్నారు. 110 మీ. వెడల్పు, 120 మీ. పొడవుతో నిర్మించే స్కై కాంకోర్స్‌లో రిటైల్ ఔట్‌లెట్స్, కియోస్కులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు.
News April 15, 2025
రేపు జపాన్ పర్యటనకు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి 22 వరకు ఎనిమిది రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. టోక్యో, ఒసాకా, హీరోషిమా, మౌంట్ ఫుజి నగరాల్లో సీఎం పర్యటిస్తారు. పెట్టుబడుల కోసం ఆ దేశంలోని ప్రముఖ సంస్థలు, పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం సమావేశం కానుంది.