News April 13, 2025
ఇందిరమ్మ ఇళ్లపై సీఎం కీలక సూచనలు

TG: ఇందిరమ్మ ఇళ్లను మొదటి దశలో అత్యంత నిరుపేదలకు, అర్హులకు మాత్రమే కేటాయించాలని CM రేవంత్ స్పష్టం చేశారు. ఈ పథకం పారదర్శకంగా, నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలని ఉన్నతస్థాయి సమావేశంలో సూచించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్తగా పని చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సిమెంట్, స్టీల్ తదితర సామగ్రిని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News July 5, 2025
ఏపీ పరిధిలోకి మధిర రైల్వే స్టేషన్?

APలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కానుండటంతో SCR పరిధిలో డివిజన్ల సరిహద్దులు మారనున్నాయి. SCRలో SEC, HYD, నాందేడ్ డివిజన్లు ఉండనుండగా, విశాఖ జోన్‌లోకి GNT, విజయవాడ, గుంతకల్లు వెళ్తాయి. TGలోని మోటమర్రి, మధిర, ఎర్రుపాలెం, గంగినేని, చెరువు మాధవరం స్టేషన్లు VJA పరిధిలోకి వెళ్తాయి. GNT పరిధిలోని విష్ణుపురం-పగిడిపల్లి(NLG, మిర్యాలగూడ), జాన్‌పహాడ్ సెక్షన్లు SECలో కలిపే ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు చేరాయి.
News July 5, 2025
నిరాశ వద్దు మిత్రమా.. విజయం తథ్యం!

మీ ప్రయత్నాలు విఫలమవుతున్నాయని నిరాశ చెందుతున్నారా? తిరస్కరణలు, నష్టాలు మీకు అడ్డంకులు కావు.. అవి ప్రక్రియలో భాగం అని తెలుసుకోండి. యూట్యూబ్ సెన్సేషన్ మిస్టర్ బీస్ట్ వైరల్ అవ్వకముందు 455 వీడియోలు అప్లోడ్ చేశారు. ఆర్టిస్ట్‌గా ఫేమస్ కాకముందు పికాసో 20 వేల పెయింటింగ్స్ వేశారు. కల్నల్ సాండర్స్ KFC ఏర్పాటు చేయకముందు 1009 సార్లు ఫెయిల్ అయ్యారు. మీలా వీళ్లు కూడా అనుకుంటే సక్సెస్ అయ్యేవారా ఆలోచించండి.
News July 5, 2025
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఏపీతో జలవివాదం నేపథ్యంలో జల్‌శక్తి మినిస్టర్‌ను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ఇతర కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.