News April 13, 2025
ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధిపై ప్రణాళికకు CM ఆదేశం

AP: ఒంటిమిట్టను ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మార్చేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించాలని CM చంద్రబాబు ఆదేశించినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. పెరుగుతున్న యాత్రికుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలను సిద్ధం చేయాలని సమీక్షలో చెప్పారన్నారు. ఒంటిమిట్ట చెరువును సుందరీకరించి బోటింగ్ సౌకర్యం కల్పించాలని సూచించారని వివరించారు. అలాగే, నిత్యాన్నదానం కోసం భవనం నిర్మించాలని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 15, 2025
రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

AP: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌కు CM చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.789 కోట్లతో హైకోర్టు భవనం నిర్మాణ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటిని ఎల్-1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటు, పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణ ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
News April 15, 2025
BREAKING: విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు

AP: మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విజయవాడ సీపీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని పేర్కొంది. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేసింది.
News April 15, 2025
ఈ నెలాఖరుకు 15వేల తొట్టెల నిర్మాణం: పంచాయతీరాజ్ శాఖ

AP: వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు 15వేల తొట్టెలను నిర్మించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. ఉపాధి హామీ పథకం కింద రూ.60 కోట్ల వ్యయంతో ఈ నెలాఖరుకు నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలిపింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న ఉపాధి హామీ కార్మికులకు, క్షేత్ర స్థాయి సిబ్బందిని పవన్ అభినందించారు.