News April 13, 2025
అనంత జిల్లా నేతలకు వైసీపీలో పదవులు

అనంతపురం జిల్లా నేతలకు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో చోటు దక్కింది. 33 మందితో మాజీ సీఎం వైఎస్ జగన్ కమిటీని నియమించగా తలారి రంగయ్య, శంకర్ నారాయణ, శైలనాథ్, విశ్వేశ్వరరెడ్డిలకు చోటు కల్పించారు. మరోవైపు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు.
Similar News
News March 25, 2026
పురపాలికల్లో వార్డుల పెంపునకు కసరత్తు

అనంతపురం జిల్లాలో కార్పొరేషన్, మున్సిపల్ పాలక వర్గాల గడువు ముగియడంతో ఎన్నికల నిర్వహణపై కసరత్తు మొదలైంది. జనాభా ప్రాతిపదికన వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అనంతపురం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 204 వార్డులకు అదనంగా 50 పెరగనున్నాయి. దీంతో మొత్తం వార్డుల సంఖ్య 254కు చేరనుంది. వార్డుల విభజన వల్ల హద్దులు మారడంతో పాటు కౌన్సిలర్లు, కార్పొరేటర్ల సంఖ్య పెరగనుంది.
News March 25, 2026
అనంతపురం: యువకుడి హత్య కేసులో ఐదుగురి అరెస్టు

అనంతపురం ఆర్టీసీ బస్టాండు వద్ద ఈ నెల 22న జరిగిన ఆదర్శ నాయుడు హత్య కేసులో ఐదుగురు నిందితులను త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పాత కక్షల నేపథ్యంలో జరిగిన ఈ దాడిలో పదునైన టైల్స్ ముక్కతో పొడవడంతో యువకుడు మృతి చెందాడు. నిందితులు బన్నీ, కరుణాకర్ రెడ్డి, రాకేష్, అస్మిత్ చౌదరి, ఉజ్జినప్పలను మంగళవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అరెస్టయిన వారంతా 19 నుంచి 23 ఏళ్ల లోపు యువకులే కావడం గమనార్హం.
News March 25, 2026
సౌత్ జోన్‌కు ఎంపికైన SKU విద్యార్థులు

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి సౌత్ జోన్ ఖోఖో టీంకు 14 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం రిజిస్ట్రార్ రమేశ్ విద్యార్థులను అభినందించారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే జాతీయ స్థాయిలో మెరుగైన క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకోవాలని వారికి సూచించారు. వీరందరూ ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కర్ణాటకలోని దావనగెరెలో జరిగే సౌత్ జోన్ పోటీల్లో పాల్గొననున్నారన్నారు.


