News April 13, 2025

ఇంటర్ ఫలితాల్లో ఒకేషనల్ విద్యార్థుల సత్తా

image

INTER ఫలితాల్లో కుప్పం GOVT. ఒకేషనల్ JR కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. 500 మార్కులకుగాను అనూష 497 స్కోర్ సాధించి టాపర్‌గా నిలిచింది. అభినయశ్రీ 495 భవ్యశ్రీ 494 స్కోర్‌తో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ జ్యోతి స్వరణ్ తెలిపారు.

Similar News

News April 15, 2025

చిత్తూరు: కిలో 7 రూపాయలే..!

image

మామిడి సాగుకు చిత్తూరు జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ అన్ని రకాల మామిడి పండుతుంది. కానీ రైతులకు ఏటా నష్టాలు తప్పడం లేదు. ఓవైపు పూత, దిగుబడి సమస్య వేధిస్తుంటే.. మరోవైపు అకాల వర్షాలు, ఈదురుగాలులు రైతును కకావికలం చేస్తున్నాయి. నిన్న జిల్లాలో వీచిన గాలులకు మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. వాటిని మండీలకు తరలిస్తే కేజీకి రూ.7 నుంచి రూ.10 మించి ధర లభించలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

News April 15, 2025

చిత్తూరు TDP నేత ఇంట్లో విషాదం

image

TDP నేత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. జీడీనెల్లూరు(M) జూపల్లిలో TDP నేత గోపాల్ రెడ్డి ఉండగా.. భార్య మీనా పిల్లలతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు. తమిళనాడులోని గుడికి సోమవారం వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. బెంగళూరులో ఆదివారం మీనా పూలమాలలు తీసుకుని బయల్దేరారు. రాత్రి గోపాల్ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. ‘దేవుడికి వేయాల్సిన మాల నీపై వేయాల్సి వచ్చింది’ అంటూ మీనా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.

News April 14, 2025

చిత్తూరు: కలిసి పనిచేసుకుందాం..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో TDP, YCP కార్యకర్తలు నువ్వానేనా అంటూ గొడవలు పడుతుంటే నేతలు మాత్రం కలిసి మెలిసి బిజినెస్‌లు చేసుకుంటున్నారు. జిల్లాలోని ఓ ఇద్దరు MLAల సహకారంతో ఓ మాజీ మంత్రి అప్పుడు(2024కు ముందు), ఇప్పుడు తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారంట. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మంత్రికి మైనింగ్ బిజినెస్‌పై మంచి పట్టు ఉంది. ఆయనతో కలిసి చిత్తూరు జిల్లా మాజీ మంత్రి మైనింగ్ చేస్తున్నారని సమచారం.

error: Content is protected !!