News April 13, 2025

తిరుమల: పాద రక్షల ఘటనపై టీటీడీ చర్యలు

image

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఇద్దరు తెల్లరంగు మెత్తటి గుడ్డతో తయారు చేసిన డిస్‌పోజబుల్ చెప్పులు ధరించి దర్శనానికి ప్రవేశించిన ఘటనపై టీటీడీ చర్యలు చేపట్టింది. విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలమైన సిబ్బందిని సస్పెండ్ చేసింది. టీటీడీ ఈవో శ్యామల రావు ఆదేశాల మేరకు ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న TTDసిబ్బంది, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేసింది.

Similar News

News September 17, 2025

సామాన్యుల నాయకుడు బద్దం ఎల్లా రెడ్డి

image

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లికి చెందిన బద్దం ఎల్లా రెడ్డి నిజాం నవాబుకు వ్యతిరేకంగా KNR జిల్లాలో జరిగిన సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించారు. రైతులు, సామాన్య ప్రజలను సంఘటితం చేసి వారికి నాయకత్వం వహించారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి నిజాం నిరంకుశ పాలనను ధైర్యంగా ఎదిరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆయన జీవితాంతం కృషి చేశారు. సాయుధ పోరాటంలో 3 సం.రాలు జైలు శిక్ష అనుభవించారు.

News September 17, 2025

పలు శాఖల పనితీరుపై సీఎం ఆగ్రహం

image

AP: హోం, మున్సిపల్, రెవెన్యూ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ శాఖలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని సర్వేలు తేల్చాయని కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు. హోంశాఖ, మున్సిపల్ శాఖలు సరిగా పనిచేయడం లేదని తనకు ఫీడ్‌బ్యాక్‌ వచ్చిందన్నారు. అన్నిశాఖల మంత్రులు, అధికారులు ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

News September 17, 2025

GNT: మణికంఠ హత్యకేసులో ముద్దాయిల అరెస్ట్

image

గుంటూరు సంగడిగుంటలో మణికంఠ(27)పై దాడిచేసి అతని మరణానికి కారణమైన 11 మంది నిందితులను లాలాపేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చుట్టుగుంటకు చెందిన యర్రం యశ్వంత్‌కి, మణికంఠతో పాతకక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో యశ్వంత్ ఈ నెల 8న మణికంఠతో గొడవపెట్టుకొని అతని స్నేహితులతో కలిసి దాడి చేయగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి తండ్రి హనుమంతరావు ఫిర్యాదుమేరకు నిందితులను అరెస్ట్ చేశారు.