News April 13, 2025
వైష్ణవిని అభినందించిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి

సింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు చెందిన 7వ తరగతి విద్యార్థిని సంకటి వైష్ణవి జాతీయ స్థాయి INSTO మ్యాథమెటిక్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమె శనివారం మంత్రి స్వామిని తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇలాంటి విజయాలతో మున్ముందు ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.
Similar News
News April 1, 2026
చీమకుర్తి: గాంధీ నగర్ 4వ లైనులో హత్య

చీమకుర్తి గాంధీనగర్ 4వ లైనులో నివాసం ఉంటున్న రామ యోగి అను వ్యక్తి బుధవారం హత్యకు గురయ్యాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన రామయోగికి ఒక కుమారుడు. రామయోగి పెయింటింగ్ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తుంటాడు. రామయోగి హత్య గురై మరణించడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
News April 1, 2026
ప్రకాశం: ఉత్తమ గ్రామ పంచాయతీగా గుండమాల

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని గుండమాల గ్రామపంచాయతీకి జాతీయ పంచాయతీ రాజ్ అవార్డులో గుర్తింపు లభించింది. ‘సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ విభాగంలో ఉత్తమ గ్రామపంచాయతీగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు సంబంధిత అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ విజయానికి సహకరించిన జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈవోకు ఎంపీడీవో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News April 1, 2026
ప్రకాశం: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్

ప్రకాశం జిల్లాలోని యువత ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రతిష్ఠాత్మకమైన సెంచూరియన్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సదరు యూనివర్సిటీతో జిల్లా యంత్రాంగం మంగళవారం కలెక్టర్ పీ.రాజబాబు ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం(MOU) చేసుకుంది. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లలో నిరుద్యోగ యువతీయువకులకు ప్రాధాన్య విభాగాలలో శిక్షణ ఇవ్వనున్నారు.
>> SHARE IT.


