News April 13, 2025

కొయ్యూరు: భారీ వర్షానికి ఎగిరిపోయిన పాఠశాల పైకప్పు

image

శనివారం ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి కొయ్యూరు మండలంలోని బూదరాళ్ల పంచాయతీ గొర్రెలమెట్ట గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాల భవనం పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పలు రేకులు పూర్తిగా ధ్వంసమై నేలకొరిగాయి. పైకప్పు రేకులు మొత్తం పోవడంతో పాఠశాల నడవని పరిస్థితి నెలకొందని పంచాయతీ సర్పంచి సాగిన ముత్యాలమ్మ, వార్డు సభ్యులు సంజీవ్ పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.

Similar News

News April 15, 2025

వడదెబ్బ బాధితులకు రూ.4 లక్షల పరిహారం

image

TG: వడదెబ్బతో మరణించినవారి కుటుంబానికి రూ.4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వడగాలులను విపత్తుగా ప్రకటిస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో వడదెబ్బ బాధితులకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేవారు. ప్రస్తుతం దానిని ప్రభుత్వం రూ.4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

News April 15, 2025

పూరీతో సినిమా.. విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

image

దర్శకుల గత సినిమాల ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని తాను పనిచేయనని నటుడు విజయ్ సేతుపతి చెప్పారు. స్క్రిప్ట్ నచ్చితేనే నటించేందుకు ఓకే చెబుతానని తెలిపారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పిన కథ నచ్చడంతోనే మూవీ చేసేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఒకే లాంటి సినిమాలు చేయకుండా జాగ్రత్త పడతానని తెలిపారు. కాగా పూరీతో మూవీ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభమవుతుందన్నారు.

News April 15, 2025

HYD: ఈ మండలాల నుంచే అధిక దరఖాస్తులు

image

నగరంలో రాజీవ్ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తుల్లో అధిక భాగం 3 మండలాల నుంచే వచ్చాయి. అసిఫ్‌నగర్, బహదూర్‌పుర, బండ్లగూడ నుంచి అధిక శాతం దరఖాస్తులు రాగా సైదాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, నాంపల్లి నుంచి కూడా అప్లికేషన్‌లు వచ్చాయి. ఈ దరఖాస్తులను పరిశీలించిన తరువాత అర్హులెవరనేది అధికారులు నిర్ణయిస్తారు.

error: Content is protected !!