News April 13, 2025
ASF : BRS సిద్ధమా.. పూర్వ వైభవం వచ్చేనా..!

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటుచేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఆసిఫాబాద్, సిర్పూర్ శ్రేణులకు ఇప్పటికే MLA కోవ లక్ష్మి, సిర్పూర్‌లో రాష్ట్ర నేత RS ప్రవీణ్‌కుమార్ దిశానిర్దేశం చేశారు. సభకు భారీగా తరలివెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా సమాయత్తమవుతున్నారు. ఇది స్థానిక పోరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?
Similar News
News April 15, 2025
కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షాలు

రాగల మూడు గంటలు ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది. మరోవైపు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది.
News April 15, 2025
ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు

ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేసింది. వర్షపాతం 105 శాతంగా నమోదవుతుందని IMD చీఫ్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు. సీజన్ మొత్తం ఎల్నినో పరిస్థితులు నెలకొంటాయన్నారు. సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాలు జూన్ 1న ప్రవేశిస్తాయి. దీంతో దేశంలో వర్షాకాలం మొదలైందని పేర్కొంటారు.
News April 15, 2025
ఏపీ నుంచి ఏపీకి వయా HYD.. గంటా ఆవేదన

AP: వైజాగ్ నుంచి అమరావతికి వెళ్లాలంటే హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడంపై TDP ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉదయం 8 గంటలకు విశాఖలో బయలుదేరి హైదరాబాద్ వెళ్లి, అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయ్యింది. విశాఖ-విజయవాడ మధ్య ఉదయం నడిచే 2 విమానాలు రద్దు కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి’ అని ఆయన వాపోయారు.