News April 13, 2025
MNCL : BRS సిద్ధమా..పూర్వ వైభవం వచ్చేనా..!

రాష్ట్రంలో అధికారం కోల్పోయాక స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటుచేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. MNCL, బెల్లంపల్లి, చెన్నూర్, ఖానాపూర్ శ్రేణులకు ఇప్పటికే జిల్లాధ్యక్షుడు సుమన్, Ex MLAలు దివాకర్‌రావు, చిన్నయ్య, ఖానాపూర్‌లో జాన్సన్‌నాయక్ దిశానిర్దేశం చేశారు. భారీగా తరలివెళ్లి సత్తా చూపించి పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్..?
Similar News
News March 25, 2026
రేపల్లె: తల్లి కోసం పరిగెత్తుతూ.. బస్సు కింద పడి బాలుడి మృతి

తల్లి కోసం పరిగెత్తుకుంటూ వెళ్లి ఓ బాలుడు ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మృతి చెందిన ఘటన నిజాంపట్నం మండలం హారిస్ పేటలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బాలుడి తల్లి బుధవారం రేపల్లె వెళ్లేందుకు ఓ ప్రైవేటు స్కూలు బస్సు ఎక్కింది. ఆమె కోసం బాలుడు పరిగెత్తుకుంటూ వెళ్లి బస్సు చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 25, 2026
HYD: సిటీని ఊపేస్తున్న కొత్త ట్రెండ్ ఇదే!

నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో Gen-Z మొదలుపెట్టిన కిర్రాక్ ట్రెండ్ సిటీని ఊపేస్తోంది. నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ప్లేట్లు పక్కనపెట్టి Cake in a Can పట్టుకుని రీల్స్ చేసిన కుర్రాళ్ళు.. ఇప్పుడు ఆ ట్రెండ్‌ని సిటీలోని పాప్-అప్ స్టాల్స్, ఇన్ఆర్బిట్ మాల్‌లోని ‘స్ట్రాబెర్రీ కార్నివాల్స్’కి షిఫ్ట్ చేశారు. స్ట్రాబెర్రీ ట్రీట్స్‌తో ‘Strawberry Stories’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే అది అసలైన ‘వైబ్’ అంటున్నారు.
News March 25, 2026
హార్ముజ్: పాక్ నౌకకు ఝలక్ ఇచ్చిన ఇరాన్

పశ్చిమాసియా యుద్ధం వేళ పాక్‌కు ఇరాన్ ఝలక్ ఇచ్చింది. హార్ముజ్ నుంచి కరాచీ వెళ్తున్న పాక్ నౌకను వెనక్కి రప్పించినట్లు IRGC తెలిపింది. హార్ముజ్ నుంచి వెళ్లేందుకు అనుమతి తీసుకోలేదని, అందుకే అడ్డుకున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని కాబూల్‌లోని ఇరాన్ కార్యాలయం ధ్రువీకరించింది. జలసంధి నుంచి వెళ్లే ప్రతినౌక ఇరాన్ అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని, లేకపోతే తాము జోక్యం చేసుకుంటామని IRGC హెచ్చరించింది.


