News April 13, 2025
అభిషేక్ వద్ద అప్పటి నుంచే ఆ నోట్ ఉంది: హెడ్

PBKSతో నిన్నటి మ్యాచ్‌లో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ అనంతరం క్రేజీ సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. 40 బంతుల్లోనే శతకం బాదిన క్రమంలో ఆరెంజ్ ఆర్మీకి <<16080847>>ఓ నోట్<<>> చూపించారు. దానిపై ఆ జట్టు మరో ఓపెనర్ హెడ్ స్పందించారు. ‘అభిషేక్ జేబులో ఆ నోట్ 6 మ్యాచ్‌ల నుంచి అలాగే ఉంది. ఉప్పల్‌లో అది బయటకు రావడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. మరోవైపు, అభిషేక్ 55 బంతుల్లోనే 141 రన్స్ బాది మ్యాచ్‌ను వన్ సైడ్ చేశారు.
Similar News
News April 15, 2025
వడదెబ్బ బాధితులకు రూ.4 లక్షల పరిహారం

TG: వడదెబ్బతో మరణించినవారి కుటుంబానికి రూ.4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వడగాలులను విపత్తుగా ప్రకటిస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో వడదెబ్బ బాధితులకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేవారు. ప్రస్తుతం దానిని ప్రభుత్వం రూ.4 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
News April 15, 2025
పూరీతో సినిమా.. విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

దర్శకుల గత సినిమాల ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని తాను పనిచేయనని నటుడు విజయ్ సేతుపతి చెప్పారు. స్క్రిప్ట్ నచ్చితేనే నటించేందుకు ఓకే చెబుతానని తెలిపారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పిన కథ నచ్చడంతోనే మూవీ చేసేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఒకే లాంటి సినిమాలు చేయకుండా జాగ్రత్త పడతానని తెలిపారు. కాగా పూరీతో మూవీ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభమవుతుందన్నారు.
News April 15, 2025
సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. సీఎల్పీ భేటీ కోసం నోవాటెల్ హోటల్‌కు వెళ్లగా ఆయన ఎక్కిన లిఫ్టులో సాంకేతిక సమస్య తలెత్తింది. ఎక్కువ మంది ఎక్కడంతో ఓవర్ వెయిట్ కారణంగా లిఫ్ట్ ఆగాల్సిన చోటు కంటే రెండు అడుగులు కిందకి దిగిన లిఫ్ట్. 8 మంది ఎక్కాల్సిన దాంట్లో 13 మంది ఎక్కడంతో సమస్య తలెత్తింది. అప్రమత్తమైన అధికారులు లిఫ్టులో నుంచి రేవంత్‌ను సురక్షితంగా బయటకు తీశారు.