News April 13, 2025

ఖమ్మం: నేడు వనజీవి రామయ్య అంత్యక్రియలు

image

పద్మశ్రీ వనజీవి రామయ్య అంత్యక్రియలు ఆదివారం అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలోని శ్మశానవాటికలో జరగనున్నాయి. అంతిమయాత్రకు జిల్లాలోని మంత్రులు, అధికారులతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యావరణ ప్రేమికులు పెద్దఎత్తున తరలిరానున్నారు.

Similar News

News November 4, 2025

మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కలెక్టర్ సమీక్ష

image

జీఎస్‌ఐ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పనను సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై మంగళవారం కలెక్టరేట్‌లో అవగాహన కార్యక్రమం జరిగింది. సంబంధిత శాఖల అధికారులు ఖచ్చితమైన వివరాలను సమయానికి అందించాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 4, 2025

వరద నష్టం నివేదిక తక్షణమే ఇవ్వాలి: కలెక్టర్

image

జిల్లాలో భారీ వర్షాల వల్ల పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాలను తక్షణం నమోదు చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో వరదల ప్రభావం, పునరుద్ధరణపై ఆమె సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ముంపు సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

News November 4, 2025

ధాన్యం తరలింపుపై కలెక్టర్ సమీక్ష

image

వర్షాల దృష్ట్యా ధాన్యం కొనుగోలు కేంద్రాలపై జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కొనుగోలు పూర్తయిన ధాన్యాన్ని వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని పోలీస్, రెవెన్యూ, మార్కెటింగ్, సివిల్ సప్లై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.