News April 13, 2025
వైసీపీ పీఏసీ కమిటీ మెంబర్‌గా ఆదిమూలపు సురేశ్

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కొండపి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేశ్‌ను శనివారం వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా నియమించిన 30 మందిలో ఆదిమూలపు సురేశ్ ఒకరు. కొండపి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వైసీపీ గెలుపే లక్ష్యంగా మున్ముందు పనిచేస్తామన్నారు.
Similar News
News April 15, 2025
ప్రకాశం: AB వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

AB వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విట్టర్(ఎక్స్) వేదికగా సోమవారం ఫైర్ అయ్యారు. “జగన్‌ని హత్యచేయాలన్న పన్నాగంతోనే శ్రీనివాస్ దాడికి పాల్పడినట్టుగా ఛార్జ్ షీట్లో ఎన్ఐఏ చెప్పిన విషయం AB వెంకటేశ్వరరావు మరిచిపోయారా అని ప్రశ్నించారు. జగన్‌పై దాడి చేసిన సమయంలో డీజీపీగా ఉన్న ఠాకూర్‌కి, ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న మీకు నామినేటెడ్ పోస్టులు ఎలా వచ్చాయ్? అంటూ ప్రశ్నించారు.
News April 15, 2025
బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ దామోదర్

తాళ్లూరు మండలం సోమవారపాడు, తూర్పు గంగవరంలోని గుంటి గంగాభవాని అమ్మవారి తిరుణాళ్ల సందర్భంగా ఏర్పాటుచేసిన పోలీస్ బందోబస్తును సోమవారం రాత్రి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. తిరుణాళ్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టిగా ఏర్పాటు చేశామన్నారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని పోలీసులకు సూచించారు.
News April 15, 2025
ప్రకాశం జిల్లాలో ఇద్దరి మృతి

ప్రకాశం జిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు మృతి చెందారు. మార్కాపురం మండలం రాయవరం బ్రిడ్జిపై బైక్ అదుపు తప్పడంతో ఈదా కాశి అనే యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు వద్ద రెండు బైకులు ఎదురుగా ఢీకొనడంతో కడప జిల్లాకు చెందిన పెద్ద ముస్తఫా అనే వ్యక్తి మృతి చెందాడు.