News March 27, 2024

హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్?

image

ప్రముఖ హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అదితిరావు హైదరిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఉదయం వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్ మూడుముళ్లు వేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో అదితి ఒకరు. ‘మహా సముద్రం’ షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడినట్లు టాక్. సిద్ధార్థ్, అదితిరావు ఇద్దరికీ ఇది రెండో పెళ్లి.

Similar News

News April 4, 2026

విద్యార్థుల నుంచి ఫీజుల్ని వసూలు చేసుకోవచ్చు: హైకోర్టు

image

TG: ప్రభుత్వం రీయింబర్స్‌మెంటు నిధుల విడుదలలో విఫలమైతే ఇంజినీరింగ్ కాలేజీలు 2026-27లో విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం నిధులు విడుదల చేశాక తిరిగి విద్యార్థులకు ఆ ఫీజుల మొత్తాలను రిఫండ్ చేయాలని ఆదేశించింది. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు విడుదల చేయకపోవడంపై కాలేజీలు దాఖలు చేసిన 14 పిటిషన్లను విచారించిన కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

News April 4, 2026

పచ్చి పేడను నేరుగా పొలంలో వేస్తున్నారా?

image

పశువుల పేడను సరైన విధానంలో వాడితే పంటకు మేలు చేస్తుంది. అయితే చాలా మంది రైతులు పచ్చి పశువుల పేడను నేరుగా పొలంలో చల్లుతుంటారు. దీని వల్ల పంటకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందంటున్నారు నిపుణులు. పచ్చి పేడలో ఉండే నులిపురుగులు మొక్క వేర్లను ఆశించి పంటను దెబ్బతీస్తాయి. అందుకే పేడను మగ్గబెట్టి వాడటం మంచిదని చెబుతున్నారు. దీని వల్ల భూసారం పెరగడంతో పాటు పంట దిగుబడి కూడా బాగుంటుందని చెబుతున్నారు.

News April 4, 2026

పాకిస్థాన్.. మీకు అంత సీన్ లేదులే!

image

భారత్‌లోకి వచ్చి దాడి చేస్తామన్న పాక్ మంత్రి ఖవాజా <<19562163>>వ్యాఖ్యలు<<>> హాస్యాస్పదంగా ఉన్నాయి. దేశాన్ని నడపడానికి అప్పుల కోసం అల్లాడుతున్న వారికి భారత్ వంటి అగ్రగామి దేశాన్ని ఎదుర్కొనే ఆర్థిక స్తోమత ఎక్కడుంది? అత్యాధునిక ఆయుధ సంపత్తి, టెక్నాలజీ పరంగా ఇండియా ఎంతో ముందుంది. బాలాకోట్, సిందూర్ ఆపరేషన్లే అందుకు నిదర్శనం. పాతకాలపు యుద్ధతంత్రంతో కయ్యానికి కాలు దువ్వితే అది పాక్ పతనానికి నాంది అవుతుంది. మీరేమంటారు?