News April 13, 2025

MHBD : BRS సిద్ధమా.. పూర్వవైభవం వచ్చేనా..?

image

రాష్ట్రంలో పదవి కోల్పోయిన తర్వాత స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటుచేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ శ్రేణులతో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్ దిశానిర్దేశం చేశారు. సభతో BRSలో జోష్ వస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని వారు ఆశిస్తున్నారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలపై ఏ మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాలి మరి.

Similar News

News April 15, 2025

నా పాటలు వాడుకున్నందుకు రూ.5కోట్లు ఇవ్వాలి: ఇళయరాజా

image

హీరో అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నిర్మాతలకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా షాక్ ఇచ్చారు. తాను గతంలో స్వరపరిచిన 3 పాటలను వాడుకున్నారని పేర్కొన్నారు. తన పర్మిషన్ లేకుండా ఉపయోగించినందుకు రూ.5కోట్లు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్‌కు నోటీసులు పంపించారు. కాగా గతంలో మంజుమ్మెల్ బాయ్స్ సినిమా మేకర్స్‌కూ ఆయన నోటీసులిచ్చారు.

News April 15, 2025

గురుకుల విద్యార్థులు తల్లిదండ్రులకు ఫోన్ చేసుకోవచ్చు!

image

TG: ఎస్సీ గురుకులాల్లో ‘ఫోన్ మిత్ర’ కార్యక్రమం ప్రారంభమైంది. దీని ద్వారా విద్యార్థులు ఎన్నిసార్లైనా ఫ్రీగా పేరెంట్స్‌తో మాట్లాడొచ్చు. విద్యార్థులను బట్టి 7-10 ఫోన్లు అందుబాటులో ఉంటాయి. నలుగురికి ఒక కాలింగ్ కార్డిస్తారు. అందులో రిజిస్టర్ చేసిన నంబర్స్‌కే కాల్ వెళ్తుంది. హెల్ప్ సెంటర్ నంబరుకూ కాల్ చేసి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. స్మార్ట్ ఫోన్ కానందున నిరుపయోగం అయ్యే ఛాన్స్ తక్కువ.

News April 15, 2025

ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్!

image

TG: మంత్రి పదవి విషయంలో పలువురు నేతలు బహిరంగంగా మాట్లాడటంపై సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పదవుల విషయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని, అలా మాట్లాడితే లాభం కంటే మీకే నష్టం ఎక్కువని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పదవుల విషయం అధిష్ఠానం చూసుకుంటుందని నేతలకు ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒక్క MLA కూడా సోషల్ మీడియా వాడట్లేదని, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు.

error: Content is protected !!