News April 13, 2025
సిరిసిల్ల : నాలుగోతరగతి పరీక్షల్లో ఆసక్తికర సమాధానం రాసిన విద్యార్థిని

రాజన్న సిరిసిల్ల(D) చందుర్తి(M)లోని ఓ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆంగ్లంలో అడిగిన ప్రశ్నకు చాలా ఆసక్తికర సమాధానం రాసింది. ఈరోజు ఇంగ్లిష్ ప్రశ్నాపత్రంలో ‘మీ అమ్మకు నచ్చినది, నచ్చని వాటి గురించి రాయండి’ అని అడిగారు. అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరని ఓ విద్యార్థిని సమాధానం రాయడంతో పేపర్ దిద్దిన టీచర్ ఆశ్చర్యపోయారు. నేటికాలంలో కోడళ్ళకు అత్తమామల పట్ల ఎలాంటి భావన ఉందో ఈ లేఖ తెలియజేస్తోంది.
Similar News
News March 25, 2026
సిద్దిపేట: పెట్రోల్ కొరత లేదు.. ఆందోళన వద్దు: DSO

సిద్దిపేట జిల్లాలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి(DSO) తనూజ స్పష్టం చేశారు. ఆయిల్ రిఫైనరీల నుంచి నిత్యం సరఫరా జరుగుతోందని, ప్రజలు భయాందోళనతో ముందస్తుగా నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ఇంధన సరఫరా సజావుగానే సాగుతుందని భరోసా ఇచ్చారు.
News March 25, 2026
ఓటీటీలోకి అవతార్ 3.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 3 మూవీ OTT రిలీజ్ ఖరారైంది. ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీలో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ కానుంది. హాట్‌స్టార్‌లో ఏప్రిల్ లేదా మే నెలలో భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ మూవీకి మిక్స్‌డ్ రివ్యూస్ రాగా, ప్రపంచవ్యాప్తంగా రూ.13 వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
News March 25, 2026
నిరుద్యోగులుగా గ్రాడ్యుయేట్లు.. స్కిల్స్ పెంచుకోండి!

ఇండియాలో డిగ్రీ ఉన్నా ఉద్యోగం దొరకడం సవాలుగా మారింది. అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ రిపోర్ట్ 2026’ ప్రకారం 20-24ఏళ్ల గ్రాడ్యుయేట్లలో 39%, 25-29ఏళ్ల వారిలో 20శాతం నిరుద్యోగులు ఉన్నారు. అయితే ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా స్కిల్స్ పెంచుకుంటే ఈ సంక్షోభాన్ని అధిగమించవచ్చంటున్నారు నిపుణులు. టెక్నికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ తోడైతే అవకాశాలు వాటంతట అవే వస్తాయంటున్నారు.


