News April 13, 2025
నిజామాబాద్ జిల్లాలో మాచర్ల వాసుల మృతి

మాచర్లకి చెందిన షేక్ షాదుల్లా, ఆయన బావమరిది మహమ్మద్ రఫీక్లు నిజామాబాద్లో మృతిచెందారు. నందిపేట పరిధి సిద్దాపూర్ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. షేక్ రఫీక్ కాలుజారి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. అతనిని రక్షించేందుకు షాదుల్లా వాగులో దిగాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగి ఊపిరాడక కన్నుమూశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాలను వెలికి తీసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 1, 2026
ఫిట్నెస్ లేని వాహనాలపై చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో జిల్లా రవాణా శాఖ ముద్రించిన కరపత్రాలు, ఫ్లెక్సీలను కలెక్టర్ బదావత్ సంతోష్ ఈరోజు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిట్ నెస్ లేని వాహనాలు, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు. జనవరి 1-31 వరకు జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
News January 1, 2026
జల వివాదాలపై చర్చకు సర్కార్ సిద్ధం!

TG: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కృష్ణా జలాల వివాదంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో BRSను ఎదుర్కోవడంపై సీఎం రేవంత్ సహా మంత్రులు సన్నద్ధమవుతున్నారు. కాసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో జరిగే చర్చలో ఎలా వ్యవహరించాలనేదానిపై నేతలకు సీఎం కూడా దిశానిర్దేశం చేశారు.
News January 1, 2026
అలాంటి సీఎంతో మేం చర్చలు చేయాలా: KTR

TG: నదీ జలాలు, సాగునీటి అంశాలపై కనీస అవగాహన లేని CM అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇవ్వబోతున్నారంటూ రేవంత్ను KTR విమర్శించారు. రేపు అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై చర్చ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భాక్రా నంగల్ ప్రాజెక్ట్ TGలో ఉందని CM అన్నారు. అది హిమాచల్ ప్రదేశ్లో ఉందన్న విషయం కూడా ఆయనకు తెలియదు. అలాంటి CMతో చర్చ చేయాలా’ అని ప్రశ్నించారు. BRSకు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చే ఛాన్సివ్వాలన్నారు.


