News April 13, 2025

కొత్తవలస: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

కొత్తవలస మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన సర్వసిద్ధి వినయ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో శనివారం రాత్రి మృతి చెందాడు. వాహనం బలంగా ఢీకొనడంతో అవయవాలు రోడ్డుపై పడి భయానక వాతావరణం చోటుచేసుకుంది. ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వినయ్ కుమార్ (27)కి 2023లో వివాహం జరిగింది.

Similar News

News April 17, 2025

నోటిఫికేషన్ వచ్చిన 50 రోజుల్లో డీఎస్సీ పరీక్ష: వేపాడ

image

డీఎస్సీ నోటిఫికేషన్ అతి త్వరలో వెలువడనున్నట్లు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు బుధవారం పేర్కొన్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 45 రోజుల నుంచి 50 రోజుల్లో డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News April 17, 2025

ABCD అవార్డు అందుకున్న విజయనగరం ఎస్పీ

image

మంగళగిరిలోని డీజీపీ హరీష్ గుప్తా చేతుల మీదుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం ABCD అవార్డును అందుకున్నారు. ఇటీవల విజయనగరం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డిజిటల్ అరెస్టు కేసును ఛేదించినందుకు రాష్ట్రస్థాయిలో జిల్లాకు అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో ఎస్పీ ABCD అవార్డును స్వీకరించారు. అనంతరం ఎస్పీను డీజీపీ హరీష్ గుప్తా అభినందించారు.

News April 16, 2025

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎంపీ

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని విజయనగరం, విశాఖ ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, భరత్ కోరారు. కలెక్టరేట్‌లో బుధవారం డిస్ట్రిక్ట్ ఎలక్ట్రసిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. పిఎం సూర్య ఘర్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఫర్ ఇంస్టాలేషన్ గ్రౌండ్ సోలార్ ప్లాంట్స్ ఎస్సి, ఎస్టి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అంబేడ్క‌ర్, అధికారులకు సూచించారు.

error: Content is protected !!