News March 27, 2024

విశాఖ: ధోనీ క్రేజ్.. ఓపెన్ అయిన గంటలోనే..!

image

ఈనెల 31న విశాఖలో చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసందే. మ్యాచ్‌కు సంబంధించి ఈరోజు ఉ.10 గంటలకు ఆన్‌లైన్ టికెట్లను అందుబాటులో ఉంచారు. ఓపెన్ అయిన గంటలోపే వెయ్యి, రూ.2వేలు, రూ.3వేలు, రూ.4 వేల టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోగా.. మ.12.30కి మొత్తం టికెట్లు అయిపోయాయి. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ధోనీ క్రేజ్ వల్లే టికెట్లు త్వరగా అయిపోయాయని ఫ్యాన్స్ అంటున్నారు.

Similar News

News March 8, 2026

విశాఖలో చేయి తడిపితేనే.. కొళాయి కనెక్షన్

image

విశాఖలోని నీటి కొళాయి కనెక్షన్‌ కోసం జీవీఎంసీకి దరఖాస్తు చేసి, ఫీజులు చెల్లించినా మంజూరులో జాప్యం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రూప్ హౌస్‌లు, అపార్ట్‌మెంట్‌ల బల్క్ వాటర్ కనెక్షన్ల విషయంలో కింది స్థాయి సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకుంటే ఫైళ్లు పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మీ పరిధిలో ఇలాంటి సమస్య ఉంటే కామెంట్ చేయండి.

News March 7, 2026

విశాఖ: పన్నులు చెల్లించకుంటే జప్తే

image

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా జీవీఎంసీ అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. రూ.650 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు మొండి బకాయిదారులపై చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 1,36,149 మంది బకాయిదారులను గుర్తించి, 1,10,136 మందికి జప్తు నోటీసులు జారీ చేశారు. నీటి పన్ను చెల్లించని 62,290 మందికి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం రూ.458.9 కోట్లు వసూలు కాగా, రూ.188.20 కోట్లు రావాల్సి ఉంది.