News April 13, 2025

తెలుగు విద్యార్థికి 300కు 300 మార్కులు?

image

ఈ నెల 2 నుంచి 8 వరకు జరిగిన JEE మెయిన్ తుది విడత పరీక్షల <>ప్రైమరీ కీ<<>> విడుదలైంది. ఏవైనా అభ్యంతరాలుంటే ఇవాళ రాత్రి 11.50 గంటల్లోపు ఆన్‌లైన్ ద్వారా పంపొచ్చు. పరిశీలన అనంతరం ఫైనల్ కీని రిలీజ్ చేస్తారు. ప్రాథమిక కీ ప్రకారం HYDలో చదువుతున్న అజయ్‌రెడ్డి 300కు 300 మార్కులు సాధించినట్లు సమాచారం. JANలో జరిగిన తొలి విడత ఎగ్జామ్‌లో ఇతను 99.966 పర్సంటైల్ స్కోర్ పొందాడు. అజయ్ సొంతూరు ఏపీలోని నంద్యాల(D) తాటిపాడు.

Similar News

News April 15, 2025

రేపటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమ్మె

image

AP: రేపటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. తొలగించిన కార్మికులను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని యాజమాన్యాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. 14 వేల మంది సమ్మెలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ముందు జాగ్రత్తగా రెగ్యులర్ ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది.

News April 15, 2025

ఈ నెల 21న ఇంటర్ ఫలితాలు విడుదల?

image

తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఈ నెల 21న విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికావొచ్చింది. వాల్యుయేషన్, మార్కుల డిజిటలైజేషన్ వారంలో పూర్తి చేసి, 21న ఫలితాలను ప్రకటిస్తారని సమాచారం. ఫలితాల కోసం 9.96 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. Way2News యాప్, బోర్డు అధికారక సైట్‌లో ఫలితాలు పొందవచ్చు.

News April 15, 2025

UPS vs NPS.. ఏ స్కీమ్ బెటర్?

image

సెంట్రల్ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(UPS) ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS)లో ఉన్నవారే UPSను ఎంచుకోవచ్చు. వీటిల్లో ఏది బెటర్ అంటే? రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉండి, స్థిరమైన పెన్షన్ ఆశించేవారికి UPS మేలని నిపుణులు సూచిస్తున్నారు. 10-20 ఏళ్ల సర్వీస్ మిగిలి ఉన్నవారు, స్టాక్ మార్కెట్‌పై అవగాహన ఉండి హైరిటర్న్స్ కావాలనుకునే వారికి NPS బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.

error: Content is protected !!