News April 13, 2025

కరీంనగర్ జిల్లాలో యాక్సిడెంట్

image

శంకరపట్నంలో శనివారం సాయంత్రం ఓ లారీ RTC బస్సును ఢీకొనడంతో అది వెళ్లి కారును ఢీకొంది. తాడికల్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై KNR నుంచి WGL వైపు వెళ్తున్న మెట్‌పల్లి డిపో RTC బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తుండగా లారీ ఢీకొట్టింది. అదే సమయంలో HZBD నుంచి KNR వైపు ఎదురుగా వస్తున్న ఓ కారును ఈ బస్సు ఢీకొంది. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.

Similar News

News March 16, 2026

కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలకు నేటి నుంచే దరఖాస్తులు

image

TG: రాష్ట్రంలో 93 KGBVల్లో ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ఇవాళ్టి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు TGRJC CETకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200. ప్రవేశ పరీక్ష మే 3న జరగనుంది. KGBVల్లో సీట్లు పొందిన బాలికలకు జేఈఈ, నీట్, క్లాట్, ఎప్‌సెట్ తదితర ప్రవేశ పరీక్షలకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

News March 16, 2026

OTD: సచిన్ శతకాల ‘సెంచరీ’ చేసిన వేళ!

image

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించి నేటికి 14 ఏళ్లు. 2012 మార్చి 16న సెంచరీ చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు కొట్టిన తొలి, ఏకైక బ్యాటర్‌గా నిలిచారు. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై 114 పరుగులతో ఈ ఘనత అందుకున్నారు. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరకపోవడం గమనార్హం. ప్రస్తుత యాక్టివ్ ప్లేయర్లలో కోహ్లీ(85) ఒక్కరే ఆ మైలురాయికి దగ్గర్లో ఉన్నారు.

News March 16, 2026

నేటి ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’: కడప కలెక్టర్

image

సోమవారం నుంచి 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, రైతుల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఖరీఫ్ సాగు పద్ధతులపై అవగాహన, పంటల ప్రణాళిక, ఆధునిక సాంకేతికతపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు.