News April 13, 2025
WGL: అర్ధరాత్రి దారుణ హత్య..!

వరంగల్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో బానోతు కొమ్మలును గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి కత్తితో పొడిచి పరారయ్యారని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 24, 2026
మూసీ ప్రక్షాళన.. మార్పు మనతోనే మొదలవ్వాలి!

ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా ప్రజల భాగస్వామ్యం లేనిదే మూసీ ప్రక్షాళన సాధ్యం కాదు. మన ఆలోచనా విధానం మారాలి. ప్లాస్టిక్ సహా ఇతర వ్యర్థాలను నేరుగా నదిలో వేయడం ఆపాలి. డ్రైనేజీ కనెక్షన్లను పద్ధతిగా ఉంచుకోవడం, నీటిని పొదుపుగా వాడుతూ మురుగును తగ్గించడం మన బాధ్యత. నదిని చెత్తకుప్పగా కాకుండా నగర జీవనాడిలా గౌరవించాలి. పౌరుల క్రమశిక్షణ, ప్రభుత్వ సంకల్పం తోడైతేనే స్వచ్ఛమైన మూసీ కల నెరవేరుతుంది.
News March 24, 2026
కొలంబియా విమాన ప్రమాదం.. 8 మంది మృతి!

కొలంబియా మిలిటరీ విమాన <<19460361>>ప్రమాదం<<>>లో 8 మంది మృతి చెందారు. సోమవారం 125 మందితో బయలుదేరిన హెర్క్యులస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. సుమారు 80 మంది గాయపడ్డట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరికొంత మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డట్లు వెల్లడించాయి. డ్రగ్ కార్టెల్స్ ఏరివేతలో భాగంగా సరిహద్దుకు వెళ్తుండగా ఈ విషాదం జరిగింది.
News March 24, 2026
SRPT: సబ్సిడీ వాహనాల దరఖాస్తులకు నేడే లాస్ట్

ఎస్సీ యాక్షన్ ప్లాన్ ద్వారా స్వయం ఉపాధి పొందే ఎస్సీ యువతకు 70-90% సబ్సిడీపై ఈవీ టూవీలర్లు, ఆటోలు, సోలార్ పంపుసెట్లను ప్రభుత్వం అందిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో 929 యూనిట్లకు సబ్సిడీ ఇవ్వనున్నారు. అర్హులు ఈనెల 24లోగా tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈవీ వాహనాలకు అప్లై చేసుకునే వారికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.


