News April 13, 2025
అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త రూల్స్!

అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త రూల్స్ అమలయ్యే అవకాశముంది. వన్డేల్లో పదేళ్ల నుంచి అమల్లో ఉన్న 2 కొత్త బంతుల విధానాన్ని మార్చాలని గంగూలీ సారథ్యంలోని క్రికెట్ కమిటీ ఐసీసీకి ప్రతిపాదించింది. ఒకప్పటిలా ఒకే బంతి వాడితే పాతబడ్డాక రివర్స్ స్వింగ్, స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. WTCలో భారీ తేడాతో గెలిస్తే, పెద్ద జట్లను చిన్నవి ఓడిస్తే అదనపు పాయింట్లు ఇవ్వాలంది. త్వరలో ICC తుది నిర్ణయం తీసుకోనుంది.
Similar News
News April 15, 2025
ఆరేళ్ల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. మార్చిలో 3.34% నమోదైంది. 2019 AUG తర్వాత ఇదే అత్యల్పం. FEBలో 3.61% నమోదైన విషయం తెలిసిందే. వరుసగా 2 నెలలు RBI టార్గెట్ 4% కన్నా తక్కువగా నమోదవడం విశేషం. నిత్యావసర ధరలు తగ్గడంతో ఆహార ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి వచ్చింది. FEBలో 3.75% ఉండగా MARలో 2.69%కు తగ్గింది. 2021 నవంబర్ తర్వాత ఇదే కనిష్ఠం. ఈ తగ్గుదల గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది.
News April 15, 2025
ప్రియుడితో ప్రముఖ నటి నిశ్చితార్థం

ప్రముఖ కన్నడ బుల్లితెర నటి వైష్ణవి గౌడ తన ప్రియుడిని వివాహం చేసుకోనున్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అనుకూల్ మిశ్రాతో ఆమె నిశ్చితార్థం ఇవాళ ఘనంగా జరిగింది. నిశ్చితార్థపు ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అభిమానులంతా ఆశ్చర్యపోయారు. ప్రియుడి గురించి గతంలో ఒక్కసారి కూడా ఆమె చెప్పలేదని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. వీరికి అభినందనలు తెలియజేస్తున్నారు.
News April 15, 2025
ప్రతీ ఎమ్మెల్యే రూ.25వేలు ఇవ్వాలి: రేవంత్

TG: పార్టీ అభివృద్ధికి ప్రతీ ఎమ్మెల్యే జీతం నుండి రూ.25 వేలు ఇవ్వాలని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తా అంటే కుదరదని నేతలకు స్పష్టం చేశారు. పదవుల విషయంలో అద్దంకి దయాకర్‌లాగా ఓపికతో ఉండాలని చెప్పారు. ఓపికతో ఉన్నాడు కాబట్టే ఆయన ఎమ్మెల్సీ అయ్యాడని తెలిపారు.