News April 13, 2025
బాపట్లలో చికెన్, మటన్ ధరలు ఇలా..!

బాపట్లలో ఆదివారం చికెన్, మటన్ ధరలకు డిమాండ్ పెరిగింది. నేడు కేజీ చికెన్ స్కిన్ లెస్ రూ.220, స్కిన్ రూ. 200ల వరకు విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.900లుగా ఉంది. ఇవే ధరలు పలు మండలాలలో కొనసాగుతున్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News January 9, 2026
రేవంత్ రైతులపై కక్షగట్టారు: హరీశ్‌రావు

TG: కరోనాలోనూ KCR రైతుబంధు అపలేదని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట(D) నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించారు. సిద్దిపేటలో పూర్తిస్థాయిలో నూనె ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. ‘కాంగ్రెస్ పాలనలో వ్యవస్థ అస్తవ్యస్తమైంది. యూరియా కోసం యాప్‌లు పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతోంది. వానాకాలం పంటలకు రూ.600కోట్ల బోనస్ పెండింగ్ పెట్టింది. రేవంత్ కావాలనే రైతులపై కక్షగట్టారు’ అని విమర్శించారు.
News January 9, 2026
పల్నాడు: TTD బోర్డు మెంబర్ పదవికి జంగా రాజీనామా

TTD బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి శుక్రవారం రాజీనామా చేశారు. తన వివరణ తీసుకోకుండానే ఓ పత్రికలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కథనాలు రావడం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. బాలాజీ నగర్‌లోని ప్లాట్‌ను రెన్యువల్ చేయాలని కోరడంపై జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. తన రాజీనామాను ఆమోదించాలని సీఎంను కోరుతూ లేఖ పంపారు. TTD గౌరవానికి భంగం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
News January 9, 2026
ఊళ్లకు వెళ్తున్నారా?.. ఈ జాగ్రత్తలు పాటించండి!

రేపటి నుంచి స్కూళ్లు, ఆఫీసులకు వరుస సెలవులు ఉండటంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడనున్నాయి. ఈ భారీ రద్దీ దృష్ట్యా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా నగదు, నగలు వంటి విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించాలి. తోపులాటలు జరిగే అవకాశం ఉన్నందున పిల్లలతో వెళ్లేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు ఎక్కేటప్పుడు తొందరపడకుండా సురక్షితంగా ప్రయాణించి పండుగను సంతోషంగా జరుపుకోండి.


