News April 13, 2025
గవర్నర్ ఆమోదం లేకుండానే బిల్లులకు చట్ట హోదా..దేశంలోనే తొలిసారి

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ అనుమతి లేకుండానే 10బిల్లులకు చట్ట హోదా కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది. దీంతో గవర్నర్ ప్రమేయం లేకుండానే బిల్లులకు చట్ట హోదా కల్పించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్ర అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపే బిల్లులను నెలలోగా అనుమతించకపోతే అది చట్టరూపం దాల్చినట్లు భావించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
Similar News
News April 15, 2025
ట్రాఫిక్ చలాన్ల జారీలో కీలక మార్పులు!

వాహనదారులకు విధించే చలాన్లపై కేంద్రం కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ని తీసుకొచ్చింది. చలాన్లు విధించే ఆటోమేటెడ్ కెమెరాలు కనీసం 10 సెకన్ల ఫుటేజ్‌ను రికార్డ్ చేయాలని ఆదేశించింది. ట్రాఫిక్ చలాన్ల అమలులో పారదర్శకతను పెంచేందుకు ఈ చర్యకు సిద్ధమైనట్లు తెలిపింది. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే 1-10 సెకన్ల వీడియోతో పాటు, టైమ్, లొకేషన్ చూపేలా చలాన్‌లో స్పష్టంగా కనిపించాలని తెలిపింది.
News April 15, 2025
వైఎస్ జగన్ పర్యటనలో ఘటనపై పోలీసుల విచారణ

AP: వైఎస్ జగన్ అనంతపురం జిల్లా పర్యటనలో జరిగిన ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పాపిరెడ్డిపల్లిలో జగన్‌ను తీసుకొచ్చిన హెలికాప్టర్‌ను కార్యకర్తలు, అభిమానులు చుట్టుముట్టారు. అదే సమయంలో హెలికాప్టర్ దెబ్బతిన్న విషయం పోలీసులకు చెప్పకుండా పైలట్, కో పైలట్ టేకాఫ్ చేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు పైలట్, కో-పైలట్‌కు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు రావాలని సూచించారు.
News April 15, 2025
‘మింత్రా’పై సోనీ మ్యూజిక్ పిటిషన్

ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ‘మింత్రా’పై సోనీ మ్యూజిక్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. మింత్రా తన ప్రొడక్ట్‌లకు సంబంధించిన ప్రకటన వీడియోలకు తమ సాంగ్స్‌తో పాటు మ్యూజిక్‌ను అక్రమంగా వాడుకుంటూ లబ్ధి పొందుతోందని సోనీ పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై ఫిబ్రవరిలోనే సదరు సంస్థను హెచ్చరించినా ప్రయోజనం లేదని వెల్లడించింది. ప్రతిఫలంగా మింత్రా నుంచి తమకు రూ.5కోట్లు ఇప్పించాలని పిటిషన్‌లో కోరింది.