News April 13, 2025

యువతికి అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తున్న యువకుడి అరెస్టు

image

సోషల్ మీడియా ద్వారా ఎలమంచిలి రాంనగర్‌కు చెందిన యువతికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తున్న యువకుడిని అరెస్ట్ చేసినట్లు ఎలమంచిలి సీఐ ధనంజయరావు శనివారం తెలిపారు. ఎస్.రాయవరం మండలం దార్లపూడికి చెందిన బొండా చండీశ్వరరావు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మార్ఫింగ్ చేసిన ఫొటోలు, అసభ్యకర సందేశాలు పంపిస్తున్నట్లు చెప్పారు. దీనిపై యువతి ఎలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు.

Similar News

News September 18, 2025

HYD: గోనెసంచిలో మృతదేహం.. దర్యాప్తు ముమ్మరం

image

చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గోనెసంచిలో మహిళ మృతదేహం దొరికిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బుధవారం ఆటో డ్రైవర్లు అదుపులోకి తీసుకుని విచారించగా.. నార్సింగి నుంచి చర్లపల్లికి ఆటో బుక్ చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు పశ్చిమబెంగాల్‌లోని మల్దా రైల్వే స్టేషన్‌లో దిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

News September 18, 2025

HYD:తెలుగు వర్శిటీ.. విజేతలు వీరే!!

image

సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్శిటీలో వర్శిటీ సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు.
మహిళా విభాగం..
✒చేస్:1.షర్మిల,2.రమాదేవి
✒క్యారం:1.రజిత,2.షర్మిల
✒షార్ట్ పుట్(Sr’s):1.స్వాతి,2.ప్రమిత,3.పద్మ
✒షాట్ పుట్(Jr’s):1.శ్రీప్రియ,2. సీతల్,3.శ్రీలేఖ
✒రన్నింగ్(100 mts):1.శ్రీప్రియ,2.శీతల్,3.శ్రీలత
✒రన్నింగ్(200 mts):1.శీతల్,2.శ్రీలత,
3.లత
✒రన్నింగ్(400 mts):1.శీతల్,2 శ్రీలత,3.శ్రీప్రియ

News September 18, 2025

ఇద్దరు MBBS విద్యార్థుల ఆత్మహత్య

image

AP: విశాఖ గీతం మెడికల్ కాలేజీలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన MBBS ఫస్ట్ ఇయర్ విద్యార్థి విస్మాద్ సింగ్ (20) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. నిన్న కాలేజీ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకున్నాడు. ‘ఈ లోకంలో నేను బతకలేను. నాకు మరో జన్మ వద్దు’ అని రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు MBBS ఫస్టియర్‌లో ఫెయిలైన విశాఖ NRI కాలేజీ స్టూడెంట్ జ్యోత్స్న ఆత్మహత్య చేసుకుంది.