News April 13, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు

image

తిరుపతి కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆ రోజున బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు దినాన్ని ప్రకటించిందన్నారు. దీంతో కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. 

Similar News

News January 5, 2026

తిరుపతి: సంక్రాంతికి ధర.. రూ.10 వేలు పైనే.!

image

సంక్రాంతి నేపథ్యంలో తిరుపతిలో ట్రావెల్స్ యజమానులు ధరలను అమాంతం పెంచేశారు. సాధారణంగా HYD-TPT మధ్య బస్సు స్లీపర్ ధర రూ.వెయ్యి-1500 ఉంటుంది. 11,12,13 తేదీల్లో ధరలు రూ.2వేల పైమాటే. సంక్రాంతి దగ్గరకొచ్చే కొద్ది రూ.5వేలకు చేరిన ఆశ్చర్యం లేదు. మరోవైపు HYD-TPT మధ్య ఫ్లైట్ ధరలు నార్మల్ డేస్‌లో రూ.3700-4500 మధ్య ఉండగా 10వ తేదీ రూ.8-10వేల మధ్య ఉంటున్నాయి. దీంతో పండుక్కు వెళ్లకుండానే జేబులు ఖాళీ అవుతున్నాయట.

News January 5, 2026

వేములవాడ: ఆలయ రిటైర్డ్ ప్రధాన అర్చకుడు కన్నుమూత

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం రిటైర్డ్ ప్రధాన అర్చకుడు అప్పాల భీమాశంకర శర్మ (65) అనారోగ్యంతో కన్నుమూశారు. వేములవాడలో అర్చక ప్రముఖులలో ఒకరైన భీమాశంకర శర్మ (భీమన్న) ఆలయ ఇన్చార్జి స్థానాచార్యగా పని చేసి ఆగస్టులో పదవీ విరమణ చేశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ, బ్రాహ్మణ సంఘం నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

News January 5, 2026

మిగిలింది 17 మంది మావోయిస్టులే.. పోలీసుల రిపోర్ట్

image

TG: 17 మంది కీలక మావోయిస్టు నేతలు మాత్రమే రాష్ట్రంలో మిగిలి ఉన్నట్టు కేంద్రానికి పంపిన రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. వారు కూడా లొంగిపోతే మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారుతుందన్నారు. అజ్ఞాతంలో ఉన్న వారిలో ముప్పాల లక్ష్మణ్ రావు (గణపతి), తిప్పిరి తిరుపతి (దేవ్ జీ), మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), పసునూరి నరహరి (సంతోష్) సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. అందరిపైనా రూ.2కోట్ల 25లక్షల రివార్డు ఉంది.