News April 13, 2025

NZB: TU పరిధిలో 16 నుంచి జరిగే ప్రాక్టికల్ పరీక్షల బహిష్కరణ

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 16నుంచి జరగబోయే ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రయివేటు కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ విషయమై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసన తెలియజేస్తూ బహిష్కరణే మార్గమని తలచి ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌కు బహిష్కరణ లేఖను పంపారు.

Similar News

News July 8, 2025

బోధన్: పథకాల అమలుపై కలెక్టర్ సమీక్ష

image

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం ఆయన బోధన్ మున్సిపాలిటీలో పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలు, ప్లాట్ల క్రమబద్దీకరణ దరఖాస్తుదారులకు అనుమతుల మంజూరు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

News July 8, 2025

NZB ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా కృష్ణ మోహన్

image

నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ కృష్ణ మోహన్‌ను నియమిస్తూ వైద్య ఆరోగ్య, ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం మహేశ్వరం మెడికల్ కళాశాలలో జనరల్ సర్జన్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం మెడికల్ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ శివ ప్రసాద్ కొనసాగుతున్నారు.

News July 8, 2025

NZB: ముగ్గురు ASIలకు SIలుగా పదోన్నతి

image

నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పని చేస్తున్న ముగ్గురు ASIలకు SIలుగా పదోన్నతి కల్పిస్తూ CP సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ASI నాగభూషణం, మాక్లూర్ PSలో పని చేస్తున్న నర్సయ్య, NZB త్రీ టౌన్‌లో పని చేస్తున్న లీలా కృష్ణకు SIలుగా పదోన్నతులు కల్పించారు. నాగభూషణం, నర్సయ్యలను నిర్మల్ జిల్లాకు, లీలా కృష్ణను ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేశారు.