News April 13, 2025
సంగారెడ్డి: మహిళపై అత్యాచారం

ఫోన్‌లో పరిచయమైన ఓ వ్యక్తి మహిళను అత్యాచారం చేసిన ఘటన వట్ పల్లిలో శనివారం జరిగింది. ఎస్ఐ విఠల్ వివరాలు.. మండలంలోని పల్వట్లకు చెందిన ఓ వివాహిత(35)తో ఫోన్‌లో పరిచయం పెంచుకున్న వ్యక్తి జోగిపేటకు వచ్చిన ఆమెను అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ సమీపంలో పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం మహిళ మెడలో ఉన్న రెండు తులాల పుస్తెల తాడు, ఫోన్ తీసుకుని పరారయ్యాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News April 17, 2026
వికారాబాద్: జోరుగా ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమాలు

వికారాబాద్ జిల్లాలో ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజును ‘చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డే’గా నిర్వహించి, విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీటు బెల్ట్ ప్రాముఖ్యాన్ని వివరిస్తూ పాఠశాలల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. రహదారి భద్రతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
News April 17, 2026
సుబేదారి: ఎస్సైపై అత్యాచారం కేసు

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శ్రీకాంత్‌పై అత్యాచారం కేసు నమోదైంది. కరీంనగర్ కమిషనరేట్‌లో పని చేస్తున్న ఆయన, 2025లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మహిళతో చాటింగ్ కొనసాగించాడు. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకొని, ఇటీవల వరంగల్‌కు వచ్చి లొకేషన్ అడిగి ఇంటికి వెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 17, 2026
యుద్ధం.. ఏవియేషన్‌కు ₹18,000 కోట్ల నష్టం!

ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ భారత విమానయాన రంగానికి గట్టిగా తగులుతోంది. సుమారు ₹18,000 కోట్ల మేర భారీ నష్టాన్ని చవిచూడబోతోందని PHDCCI నివేదిక అంచనా వేసింది. విమాన మార్గాల మళ్లింపుతో జర్నీ టైమ్ 4 గంటల వరకు పెరగడమే కాకుండా, ఇంధన ఖర్చులు తడిసి మోపెడవడం అందుకు కారణం. మరోవైపు భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా 20% వరకు పడిపోయే ప్రమాదం ఉన్నట్లు నివేదిక పేర్కొంది.


