News March 27, 2024
ప్రకాశం: 8న సాగర్ జలాల విడుదలకు అవకాశం
జిల్లాలో ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 8వ తేదీ సాగర్ జలాలు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. నీళ్లు చోరీకి గురికాకుండా నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ సిబ్బందితో పహారాకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో చేతి పంపుల మరమ్మతు పనులు చేపట్టాలన్నారు.
Similar News
News November 22, 2024
ఒంగోలు: ఇతను విమానాల్లో తిరిగే దొంగ
మధ్యాహ్న సమయంలో మాత్రమే దొంగతనాలు చేసే వ్యక్తి తిరుపతి పోలీసులకు చిక్కాడు. ప్రకాశం(D) సింగరాయకొండ(M) సోమరాజుపల్లికి చెందిన గురువిళ్ల అప్పలనాయుడు(29), చెడు అలవాట్లకు బానిసై 16వ ఏట నుంచి దొంగతనాలు చేస్తున్నాడు. విమానాల్లో తిరుగుతూ.. ఎంజాయ్ చేస్తుంటాడు. తిరుపతిలోని ఓ ఫైనాన్స్ ఆఫీసులో ఈనెల 15న రూ.8 లక్షలు దొంగలించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరాయకొండ, ఒంగోలు, విశాఖలో ఇతనిపై 18 కేసులు ఉన్నాయి.
News November 22, 2024
నామినేషన్ వేసిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
అసెంబ్లీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ) సభ్యుల ఎన్నికకు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈయన వైసీపీ నుంచి యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా 5477 ఓట్లతో గూడూరి ఎరిక్షన్ బాబుపై గెలిచారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఈయన ఒకరు.
News November 22, 2024
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం ఎస్పీ
పట్టణాలు, గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను గుర్తించడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం ఎస్పీ దామోదర్ సూచించారు. ప్రజలు, విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల పర్యవసనాలు, గుడ్, బ్యాడ్ టచ్, రోడ్డు ప్రమాదాల నివారణలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు ఎస్పీ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.