News April 13, 2025
రేగిడి: చెట్టును ఢీకొన్న టిప్పర్.. డ్రైవర్ దుర్మరణం

ఇసుక లోడింగ్ కోసం వెళ్తున్న టిప్పర్ రేగిడి (M) రెడ్డి పేట సెంటర్ వద్ద ఆదివారం ఉదయం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ ముందుభాగం పూర్తిగా దెబ్బతినడంతో అనకాపల్లికి చెందిన డ్రైవర్ నాగరాజు క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. తనను కాపాడాలంటూ చేసిన ఆర్తనాదాలతో తోటి డ్రైవర్లు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నాగరాజును బయటికి తీసేందుకు ప్రయత్నించగా అప్పటికే చనిపోయాడు.
Similar News
News March 9, 2026
VZM: కలెక్టరేట్‌లో నేడు PGRS కార్యక్రమం

విజయనగరం జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలను స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News March 8, 2026
VZM: అండర్-13, 18 క్రీడాకారుణులకు పరుగు పందెం పోటీలు

మహిళా దినోత్సవం సందర్భంగా మై భారత్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం బాబామెట్టలోని విజ్జీ స్టేడియంలో జరిగాయి. అండర్-13, 18 18 ఏళ్లు పైబడిన విభాగాల్లో 100, 200, 400 మీటర్ల పరుగు పందెం పోటీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థినులు పాల్గొన్నారు. విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లను అందజేశారు.