News March 27, 2024
బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్‌కు డీజీపీ డిస్క్ గోల్డ్ మెడల్

బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు డీజీపీ డిస్క్ గోల్డ్ మెడల్ అవార్డు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల విభాగంతో పాటు దిశ, కన్విక్షన్ బెస్ట్ పోలీసింగ్‌లో ఎస్పీ వకుల్ జిందాల్ ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అవార్డును అందించనున్నారు.
Similar News
News February 17, 2026
GNT: తపాలా శాఖపై పెమ్మసాని సమీక్ష

గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తపాలా శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, ఏపీ సహా పలు సర్కిళ్ల పనితీరును పరిశీలించారు. తెలంగాణ సర్కిల్ ఉత్తమ ఫలితాలు సాధించిందని ప్రత్యేకంగా ప్రశంసించారు. మిగిలిన సర్కిళ్లు ‘టెక్-ఫస్ట్’ విధానాన్ని పాటించాలని సూచించారు. వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణతో సేవలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

GNT: అసెంబ్లీలో విద్యార్థుల సందడి

ఏపీ అసెంబ్లీ విద్యార్థులతో కిటకిటలాడింది. మంగళవారం సుమారు 300 మంది విద్యార్థులు సభను సందర్శించారు. గత ఐదు రోజుల్లో మొత్తం 1,100 మంది వచ్చారు. సభా కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. విరామ సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు విద్యార్థులను పలకరించారు. వారి సందేహాలను స్పీకర్ నివృత్తి చేశారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు.