News April 13, 2025
రోడ్డు ప్రమాదంలో అనకాప్లలి వాసి మృతి

అనాకపల్లికి చెందిన డ్రైవర్ నాగరాజు ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇసుక లోడ్ కోసం వెళ్తుండగా రేగిడి (M)రెడ్డి పేట సెంటర్ వద్ద టిప్పర్ అదుపుతప్పి చెట్టుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగరాజు క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. తనను కాపాడాలంటూ చేసిన ఆర్తనాదాలతో తోటి డ్రైవర్లు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నాగరాజును బయటికి తీసేందుకు ప్రయత్నించగా అప్పటికే చనిపోయాడు.
Similar News
News April 19, 2026
రేపు నస్తూరుపల్లికి సీఎం రాక

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లిలో సోమవారం సీఎం ప్రజాపాలన బహిరంగ సభ జరగనుంది. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడ ఇంజినీర్లతో చర్చలు జరిపిన అనంతరం ప్రాజెక్టులో దెబ్బతిన్న గేట్లను పరిశీలిస్తారు. సాయంత్రం నస్తూరుపల్లి బహిరంగ సభలో రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News April 19, 2026
ఒకే వేదికపై ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ

జగిత్యాలలో ప్రముఖ చరిత్రకారుడు జైషెట్టి రమణయ్య సంస్మరణ సభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో MLA సంజయ్ కుమార్, MLC ఎల్ రమణ ఒకే వేదికపై పాల్గొని రమణయ్య చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు. ప్రస్తుత బీఆర్‌ఎస్-కాంగ్రెస్ రాజకీయ వాతావరణంలో ఈ ఇద్దరు నాయకులు ఒకే వేదికపై కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సంస్మరణ సభ అయినప్పటికీ ఈ దృశ్యం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
News April 19, 2026
ఓదెల మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

పెద్దపల్లి జిల్లా ఓదెల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి బోనాలు, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలోని మదన పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు. అటు ఎండ తీవ్రత భారీగా పెరగడంతో ఆలయ చుట్టూ తడకలు వేసి చల్లని వాతావరణాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.


