News April 13, 2025

సన్నబియ్యం దారి మల్లిస్తే చర్యలు: ఖమ్మం CP

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం దారి మళ్లించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. ప్రజలు దొడ్డు బియ్యం తినలేకపోతున్నారనే ఆలోచనతో ఎంతో ఖర్చుతో సన్న బియ్యం పథకం అమలు చేస్తుంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటింటికి తిరిగి సన్నబియ్యం కొనుగోలు చేసే వ్యక్తుల వివరాలు సేకరించాలని పోలీసులను ఆదేశించారు.

Similar News

News March 6, 2026

అమరావతిలో ‘నైలిట్’ కేంద్రం ఏర్పాటు

image

అమరావతిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (నైలిట్) కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలిపింది. నైలిట్ ప్రతినిధులు డా.జయరాజ్, డా.లక్ష్మణ్ కొర్రా ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ముందుగా తాత్కాలిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా యువతకు ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో డిజిటల్ నైపుణ్యాలు, మెరుగైన శిక్షణ అందుబాటులోకి రానున్నాయి

News March 6, 2026

KMR: ఎండలు మండుతున్నాయి.. జాగ్రత్తలు అత్యావశ్యకం

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పది రోజులుగా ప్రతిరోజు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఓవైపు ప్రజలు పెళ్లిళ్ల జోరుతో ఏసీ ఫంక్షన్ హాల్ లను వినియోగించుకుంటుండగా, మరోవైపు పలు మండల కేంద్రాలలో చలివేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. నిన్న 37.9°C ఉష్ణోగ్రత నమోదు అవ్వడంతో, ఎండ నుంచి ఉపశమనం పొందాలని, ప్రతి రోజు 4 నుంచి 5 లీటర్ల నీరు సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు.

News March 6, 2026

గన్నవరం: మంచు ఎఫెక్ట్.. విమానాల రాకపోకలు ఆలస్యం

image

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో మంచు ప్రభావంతో శుక్రవారం ఉదయం విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. చెన్నై, హైదరాబాద్ నుంచి రావాల్సిన విమానాలు ఆలస్యంగా గన్నవరం చేరుకున్నాయి. గన్నవరం నుంచి విశాఖపట్నం, హైదరాబాద్‌కు వెళ్లే విమానాలు కూడా సుమారు అరగంట ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. మంచు కారణంగా ప్రయాణికులు కొంత అసౌకర్యం ఎదుర్కొంటున్నారు.