News April 13, 2025
జగిత్యాల: HATSOFF కలెక్టర్ సాబ్

కొండగట్టు చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా 2 రోజులుగా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆలయ ఆవరణలో తిరుగుతూ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్, అత్యవసర సేవలు, శానిటైజేషన్ తదితర వాటిని సమీక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకుంటున్నారు.
Similar News
News November 8, 2025
నవంబర్ 8: చరిత్రలో ఈరోజు

1948: గాంధీని హత్య చేసినట్లు అంగీకరించిన గాడ్సే
2016: పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన కేంద్రం
1656: తోకచుక్కను కనుగొన్న సైంటిస్ట్ ఎడ్మండ్ హేలీ జననం
1927: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ జననం
1969: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జననం
1977: డైరెక్టర్ బీఎన్ రెడ్డి మరణం
2013: కమెడియన్ ఏవీఎస్ మరణం
News November 8, 2025
హోంగార్డుల సంక్షేమానికి కృషి: ఎస్పీ

హోంగార్డుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉంటామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డులు పి. జాన్, సీహెచ్ భవానీలకు ‘చేయూత’ కింద రూ.6.55 లక్షల చెక్కులను ఎస్పీ అందజేశారు.
News November 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


