News April 13, 2025

మాజీ మంత్రి రోజాకు కీలక బాధ్యతలు 

image

వైసీపీ రాజకీయ సలహా మండలి (PAC)ని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా ఆ పార్టీలోని 30 మంది సీనియర్లకు చోటు కల్పించారు. చిత్తూరు జిల్లా నుంచి మాజీ మంత్రులు ఆర్కే రోజా, నారాయణస్వామికి అవకాశం దక్కింది. తమకు అవకాశం కల్పించిన జగన్‌కు ఇద్దరు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామన్నారు.

Similar News

News March 21, 2026

MNCL: అడవి బిడ్డల అక్షర గొంతుక.. అల్లం రాజయ్య!

image

అక్షరాన్ని ఆయుధంగా మలచి, పీడిత ప్రజల పక్షాన నిలిచిన కలం యోధుడు అల్లం రాజయ్య. ప్రపంచ కవితా దినోత్సవం వేళ ఈ మంచిర్యాల ముద్దుబిడ్డను స్మరించుకోవడం ప్రతి అక్షర ప్రేమికుడి బాధ్యత. సామాన్య కుటుంబంలో పుట్టి, క్షేత్రస్థాయి కష్టాలను కళ్లకు కట్టినట్లు రాశారు. ఆయన సృష్టించిన కొలిమి అంటుకున్నది, ఆగంతకుడు రచనలు అణచివేతపై ధిక్కారస్వరాలు. బడుగు వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన రాజయ్య, భావితరాలకు స్ఫూర్తిప్రదాత.

News March 21, 2026

కామారెడ్డి: షబ్బీర్ అలీకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ, ఏఎస్పీ

image

కామారెడ్డి పట్టణంలోని ఈద్గా మైదానంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు నిర్వహించిన సామూహిక ప్రార్థనలు భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఎస్పీ రాజేశ్ చంద్ర, ఏఎస్పీ చైతన్య రెడ్డి కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, సమాజంలో సోదరభావం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

News March 21, 2026

KNR: భార్యాభర్తల బంధం.. అక్కడ అలా.. ఇక్కడ ఇలా..!

image

ఒకే రోజు వెలుగులోకి వచ్చిన రెండు వేరువేరు ఘటనలు ఉమ్మడి KNR జిల్లా వాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఒక ఘటనలో అనారోగ్యంతో ఉన్న JGTL(D) ఎండ్రకాయ శ్రీధర్‌ను భార్య శ్మశానవాటికలో వదిలేసి వెళ్లగా, మరో ఘటనలో భార్య మరణాన్ని తట్టుకోలేక KNR టూటౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ తన ప్రాణాలు త్యాగం చేశారు. ఈ రెండు ఘటనల్లో ఒకరు నిస్సహాయతతో బంధాన్ని తెంచుకుంటుంటే, మరొకరు బంధం కోసమే ప్రాణాలు తీసుకున్నారు.