News April 13, 2025

జావెలిన్ త్రోయర్‌పై నాలుగేళ్ల నిషేధం

image

భారత జావెలిన్ త్రోయర్ డీపీ మనుపై NADA నాలుగేళ్ల నిషేధం విధించింది. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్-1 సందర్భంగా అతడి నుంచి శాంపిల్స్ సేకరించగా నిషేధిత పదార్థం వాడినట్లు తేలింది. ఆ పోటీల్లో మను విజేతగా నిలవడం గమనార్హం. అయితే డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో అతడిపై నాడా తాత్కాలిక నిషేధం విధించింది. మనుపై 2028 వరకు నిషేధం కొనసాగించనున్నట్లు తాజాగా ప్రకటించింది.

Similar News

News April 15, 2025

పవన్ కుమారుడిపై అనుచిత వ్యాఖ్యలు.. నిందితుల అరెస్ట్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఆ అంశంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ప్రత్తిపాడు పీఎస్‌లో కేసు నమోదైంది. తాజాగా నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్క్‌తో పాటు పవన్ భార్యపైనా వీరు తప్పుడు పోస్టులు పెట్టినట్లు సమాచారం.

News April 15, 2025

UPDATE.. కింగ్‌డమ్ డబ్బింగ్ స్టార్ట్

image

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కింగ్‌డమ్’ మూవీ డబ్బింగ్ ప్రారంభమైనట్లు హీరో విజయ్ దేవరకొండ ఇన్‌స్టా స్టోరీలో తెలిపారు. ఇప్పటికే సగం పార్ట్ పూర్తయిందని వెల్లడించారు. విజయ్ స్టోరీని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. మే 30న సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు-హీరో సిద్ధమయ్యారని రాసుకొచ్చింది.

News April 15, 2025

రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు

image

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ పేర్లను చేర్చినందుకు నిరసనగా రేపు దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈడీ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాల పీసీసీలకు లేఖ రాసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలందరూ వీటిలో పాల్గొనాలని పేర్కొంది.

error: Content is protected !!