News April 13, 2025
సింహాచలం: చందనోత్సవానికి 51 ప్రత్యేక బస్సులు

సింహాచలంలో ఏప్రిల్ 30న జరిగే చందనోత్సవానికి కొండ మీదకు 51 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు శనివారం తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండమీదకు వెళ్లే బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గోశాల, శ్రీనివాస్ నగర్, అడివివరం నుంచి ఈ బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఆరోజున భక్తుల వాహనాలు కొండమీదకు అనుమతి లేదని ఈ బస్సులు వినియోగించుకోవాలన్నారు.
Similar News
News April 15, 2025
భద్రకాళి అమ్మవారికి వరంగల్ తూర్పు జర్నలిస్టుల వినతి

వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తక్షణమే అర్హులైన వారికి అందజేయాలనే నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారికి వినతిపత్రం సమర్పించారు. మంత్రి సురేఖ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని ఆ వినతిపత్రంలో కోరారు.
News April 15, 2025
కృష్ణా: ధాన్యం సేకరణకు 128 మిల్లులకు అనుమతులు

ఖరీఫ్ మిగులు ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 228 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతు సేవ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. 128 రైస్ మిల్లులకు ధాన్యం సేకరణకు అనుమతి ఇచ్చామన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్‌లు అందుబాటులో ఉంచామన్నారు.
News April 15, 2025
భువనగిరి జిల్లా టాప్ న్యూస్

* అమ్మానాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన బాబూ మోహన్ * పదోతరగతి మూల్యాంకన పూర్తి * ఆత్మకూర్‌లో అత్యధికంగా 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత * ప్రజా సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ హనుమంతరావు * ఈనెల 25 వరకు ఆర్మీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు * పైన టూల్ బార్‌లో లోకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్ క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా వార్తలను 5 నిమిషాల్లో తెలుసుకోండి.