News April 13, 2025

వికారాబాద్: RYVకి అప్లై చేశారా.. 14 వరకే ఛాన్స్

image

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్‌ యువ వికాసం పథకం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. శనివారం వరకు జిల్లాలో 15 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. రేపటి వరకు ఛాన్స్ ఉన్నందున ఈ అవకశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.

Similar News

News April 3, 2026

ప్రసవం తర్వాత డిప్రెషన్‌లోకి తండ్రులు: అధ్యయనం

image

బిడ్డ పుట్టిన తర్వాత తండ్రులకూ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉందని JAMA నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురించిన కొత్త అధ్యయనంలో వెల్లడైంది. సుమారు 30%మంది తండ్రులు ఈ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. నిద్రలేమి, పెరిగిన బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలు. తండ్రి డిప్రెషన్‌లో ఉంటే అది తల్లి ఆరోగ్యం, బిడ్డ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

News April 3, 2026

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై మీ అభిప్రాయం ఏంటి..?

image

తెలంగాణలో మార్చి 6వ తేదీ నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, తాగునీటి సరఫరా ఇబ్బందులను పరిష్కరించడం లాంటివి చేపట్టాల్సి ఉంది. మరీ హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం కొనసాగుతుండగా మీ ప్రాంతంలో సమస్యలను అధికారులు తీర్చారా..?, మీ వద్దకు వచ్చారా..? మీరు ఇందులో భాగమయ్యారా..? కామెంట్ రూపంలో తెలపండి.

News April 3, 2026

పెంచలకోన బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం: MLA

image

పెంచలకోన శ్రీపెనుశిల లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహిస్తామని వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు. దేవస్థానం ప్రాంగణంలో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు. ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు ఉత్సవాలు జరుగుతాయని, భక్తులకు దర్శనం, అన్నదానం, తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపరచాలని ఆదేశించారు. సీసీ కెమెరాలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు.