News April 13, 2025
HYD: అశ్లీల చిత్రాలు చూస్తున్నారా? జాగ్రత్త..!

సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసినా, ఇతరులకు షేర్ చేసినా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని HYD టప్పాచబుత్రా పోలీసులు Xలో పోస్ట్ చేశారు. ఇటీవల HYD శివారు మిరుదొడ్డిలో యువకుడు అశ్లీల చిత్రాలు చూస్తూ SMలో పోస్ట్ చేశాడు. గుర్తించిన సైబర్ సెక్యూరిటీ అధికారులు అతడిని రిమాండ్ చేసి.. ఫోన్, సిమ్ స్వాధీనం చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. లైక్‌ల కోసం వీటిని పోస్ట్ చేయొద్దని, SMని మంచికోసం వాడాలని సూచించారు.
Similar News
News July 9, 2025
HYD: రేపు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం

రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించనున్నారు. 5వ బంగారు బోనాన్ని సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి సమర్పించనున్నట్లు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఛైర్మన్ రాఘవేందర్ తెలిపారు. కాగా, ఇప్పటికే గోల్కొండ జగదాంబ అమ్మవారు, విజయవాడ కనకదుర్గ, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనాన్ని సమర్పించిన విషయం తెలిసిందే.
News July 9, 2025
HYD: మహిళలు.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి

మహిళలకు అండగా రాచకొండ షీ టీమ్స్ ఉంటుందని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. గత 15 రోజుల్లో 185 మంది పొకిరీలను షీ టీమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 215 ఫిర్యాదుల్లో 9 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. మెట్రో, బస్టాండ్లలో షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లను నిర్వహిస్తోందని, మహిళలు వేధింపులకు గురైతే రాచకొండ వాట్సప్ నంబర్ 8712662111కు ఫిర్యాదు చేయాలన్నారు.
News July 9, 2025
ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీం ఎత్తివేసే కుట్ర: ఆర్.కృష్ణయ్య

కాలేజ్ విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీంను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. ప్రభుత్వ కుట్రలో భాగంగా ట్రస్ట్ బ్యాంక్ నిధి అనే సరికొత్త ప్రతిపాదన కాలేజీ యాజమాన్యాల ద్వారా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు.