News April 13, 2025

కోనసీమ: మోగనున్న పెళ్లి బాజాలు.. మండపాలకు డిమాండ్

image

కొంత విరామం తర్వాత మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. దీంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం, కొత్తపేట, ముమ్మిడివరం, అల్లవరం, రాజోలు, పి.గన్నవరం మండలాల పరిధిలో కళ్యాణ మండపాలకు డిమాండ్ పెరిగింది. ఈవెంట్ ఆర్గనైజర్లు, కళ్యాణ మండపాల నిర్వాహకులు సైతం బిజీ అయ్యారు. జూన్ వరకు ముహూర్తాలు ఉన్నాయి. పంచాంగకర్తలు చెప్పిన శుభ ముహూర్తాలు. ఏప్రిల్‌: 13,16,20,30 మే: 1,7,8,9,10,11,14,18,23 జూన్‌: 4,5,6,7,8

Similar News

News March 24, 2026

తిరుపతి: తప్పుడు నివేదిక.. వృద్ధురాలి ఆవేదన

image

పిచ్చాటూరు(M) అడవికోడియంబేడుకు చెందిన దమయంతి సాగుభూమికి వెళ్లేందుకు దారి చూపాలని కలెక్టర్‌కు PGRSలో ఫిర్యాదు చేసింది. తాను పొలానికి వెళ్లే మార్గం లేకుండా ప్రహరీ కట్టారని వాపోయింది. విచారణ చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మండల రెవెన్యూ అధికారులు మాత్రం సమస్యను పరిష్కరించకుండా కలెక్టర్‌కు తప్పుడు నివేదికలు పంపినట్లు సమాచారం. ఆమె మళ్లీ కలెక్టర్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు.

News March 24, 2026

25న వరంగల్ డీసీసీ బ్యాంక్ మహాసభ

image

వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీ) మహాసభ ఈ నెల 25న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు సీఈఓ మహ్మద్ వజీర్ సుల్తాన్ తెలిపారు. నక్కలగుట్టలోని డీసీసీ బ్యాంక్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన సభ జరగనుంది. బ్యాంక్ అభివృద్ధి, ఆర్థిక వ్యవహారాలపై చర్చలు జరగనున్నాయి. సభ్యులందరూ సమయానికి హాజరై సభను విజయవంతం చేయాలని అధికారులు కోరారు.

News March 24, 2026

పోలవరం: తల్లి మరణం.. దుఃఖాన్ని దిగమింగుకుంటూ పరీక్ష రాసిన విద్యార్థిని

image

తల్లి మరణించిన దుఃఖంలో టెన్త్ పరీక్ష రాసింది ఓ విద్యార్థిని. ఈ సంఘటన పోలవరం జిల్లా రాజవొమ్మంగిలో సోమవారం చోటు చేసుకుంది. కొయ్యురు మండలం కొత్తపల్లికి చెందిన సావిత్రి తల్లి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. రాజవొమ్మంగి బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆ బాలిక సోమవారం లెక్కలు పరీక్ష రాసింది. దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆమె పరీక్ష రాయడంతో తోటి విద్యార్థినులు, టీచర్స్ చలించిపోయారు.