News April 13, 2025
HYD: అశ్లీల చిత్రాలు చూస్తున్నారా? జాగ్రత్త..!

సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసినా, ఇతరులకు షేర్ చేసినా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని HYD టప్పాచబుత్రా పోలీసులు Xలో పోస్ట్ చేశారు. ఇటీవల HYD శివారు మిరుదొడ్డిలో యువకుడు అశ్లీల చిత్రాలు చూస్తూ SMలో పోస్ట్ చేశాడు. గుర్తించిన సైబర్ సెక్యూరిటీ అధికారులు అతడిని రిమాండ్ చేసి.. ఫోన్, సిమ్ స్వాధీనం చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. లైక్‌ల కోసం వీటిని పోస్ట్ చేయొద్దని, SMని మంచికోసం వాడాలని సూచించారు.
Similar News
News April 16, 2025
5 నిమిషాల్లో RR జిల్లా చుట్టేయండిలా!

మీ జిల్లాలో జరిగిన అన్ని విషయాలు తెలుసుకునేందుకు Way2News యాప్‌లో ఇలా చేయండి. యాప్ ఓపెన్ చూస్తే రైట్ సైడ్ టాప్ మీ లొకేషన్ పేరుపై క్లిక్ చేయండి. పక్కన V సింబల్‌పై క్లిక్ చేస్తే 4 ఆప్షన్స్ మీ గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా చూపిస్తుంది. వాటిలో జిల్లాపై క్లిక్ చేస్తే 5MINలో మీ జిల్లా మొత్తం ఓ రౌండ్ వేయొచ్చు.
News April 15, 2025
BREAKING: సీఎంకు తప్పిన ప్రమాదం

HYD నోవాటెల్‌లో సీఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సీఎం రేవంత్ ఎక్కిన లిఫ్ట్‌లో ఓవర్ వెయిట్ కారణం కిందికి పడిపోయినట్లు సమాచారం. సీఎం సెక్యూరిటీ వెంటనే అప్రమత్తమైంది. సీఎంను బయటకు తీసుకురాగా.. మరో లిఫ్ట్‌లో సెకండ్ ఫ్లోర్‌కు చేరుకున్నారు. నోవాటెల్‌లో సీఎల్పీ సమావేశానికి సీఎం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
News April 15, 2025
హైదరాబాద్ శివారులో చిరుతలు?

నగర శివారులోని ఇక్రిశాట్ క్యాంపస్‌లో సోమవారం సిబ్బందికి రెండు చిరుతల ఆనవాళ్లు కనిపించాయి. దీంతో సిబ్బంది వాటిని ఫొటో తీశారు. అయితే అవి నిజంగా చిరుతలా? లేక పెద్ద పిల్లులా? అని తేలాల్సి ఉందని ఇక్రిశాట్ అధికారులు తెలిపారు. అటవీ అధికారులను సంప్రదించి నిర్ధారిస్తామని పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఇక్రిశాట్ కమ్యూనికేషన్ హెడ్ తాహిర తెలిపారు.